పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. పవన్ తో ఒక్క సినిమా అయినా తీయాలని కలలు కంటున్న దర్శకనిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. పవన్ ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా కొంతకాలం గ్యాప్ లో ఈ నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఈ నెల చివరి వారంలో బ్రో మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బ్రో మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించి పవన్ కళ్యాణ్ ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
తాజాగా పవన్ మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ నటులలో నేను కూడా ఒకడినని ఆయన తెలిపారు. పాలిటిక్స్ లోకి వచ్చే అవసరం నాకు ఉందా అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నా భార్యను ఇతరులతో తిట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా వరుస విజయాలతో పవన్ కళ్యాణ్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొలిటికల్ గా సక్సెస్ సాధించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. పవన్ కళ్యాణ్ ఇతర హీరోల అభిమానుల మద్ధతును సైతం కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ భాషతో సంబంధం లేకుండా సత్తా చాటుతుండటం గమనార్హం.