స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. యూఎస్ లో ఇప్పటికే భీమ్లా నాయక్ ప్రీమియర్స్ ప్రదర్శితం కాగా అక్కడినుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. భీమ్లా నాయక్ క్లైమాక్స్ లో మార్పులు చేశారని అయితే ఆ మార్పులు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లో పోలీస్ యూనిఫామ్ లో పవన్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే సినిమా రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ టికెట్ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. అతి తక్కువ టికెట్ రేట్లకే థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పాస్టర్ మార్టిన్ నీమోల్లర్ సూక్తిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
తనకు ఇష్టమైన సూక్తులలో ఇది ఒకటని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆ సూక్తిలో మొదట వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారని నేను మాట్లాడలేదని ఎందుకంటే నేను సామాజికవాదిని కాదని పేర్కొన్నారు. ఆ తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియన్ వాదుల కొరకు వచ్చారని కానీ తాను ట్రేడ్ యూనియన్ వాదిని కాదు కాబట్టి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారని తాను యూదుడిని కాదు కాబట్టి మాట్లాడలేదని పేర్కొన్నారు.
ఆ తర్వాత వాళ్లు నాకోసం వచ్చారని నా తరపున మాట్లాడటానికి ఎవరూ లేరనే సూక్తిని పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. పక్కవాడికి అన్యాయం జరుగుతోందని నాకు జరగడం లేదని భావిస్తే రేపు నీదాక వస్తుందని అప్పుడు ఏం చేస్తావని ఇప్పుడే మాట్లాడాలని అన్యాయాన్ని ప్రశ్నించాలని పవన్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. పవన్ చేసిన షాకింగ్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
One of my all time favourite quote,wich came out of immense suffering ,pain & realisation from ‘Pastor Martin Niemoller’ during Nazi Germany regime. What an eternal truth! pic.twitter.com/15oUJl8EOA
— Pawan Kalyan (@PawanKalyan) February 24, 2022
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!