Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చెప్పు చూపించడానికి అసలు కారణం అదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమా ఇండస్ట్రీలో కానీ, యూత్ లో కానీ, ఫ్యాన్స్ లో కానీ ఆయనకున్న క్రేజ్ గురించి.. స్టార్ డమ్ అండ్ మార్కెటింగ్ స్టామినా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. సినిమాలు చేసుకుంటూ టాప్ స్టార్ గా దూసుకుపోతున్న పవన్.. ప్రజల తరపున పోరాడడానికి జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో అయితే దర్శక నిర్మాతలు మొదలుకుని అందరూ తన మాట వింటారు. తన అడుగులకు మడుగులొత్తుతారు కానీ పాలిటిక్స్ దీనికి కంప్లీట్ డిఫరెంట్.. ఇక్కడ పూల దండలు వేయుచుకుంటే అక్కడ రాళ్లు, చెప్పులు మీద వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే పార్టీ పెట్టిన దగ్గరినుండి పవన్ ని పర్సనల్ గా టార్టెట్ చేసేవారు ఎక్కువై పోయారు.

అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యంలోకి పవన్ ఎంట్రీ ఇచ్చినప్పుడే ఆయణ్ణి పర్సనల్ గా కెలకడం అనేది స్టార్ట్ అయ్యింది. ఇక సొంతపార్టీ పెట్టాక అది తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ ప్రసంగాల్లోనూ సినిమా డైలాగుల మాదిరిగా తన స్టైల్లో స్పీచులిచ్చే పవన్ అప్పుడప్పుడు మీడియా సాక్షిగా ఆవేశంతో సహనం కోల్పోవడం అనేది అందరూ చూశారు.ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఏకంగా కాలి చెప్పు తీసి మరీ అధికార పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. వైజాగ్ లో జనసేన కార్యకర్తల్ని బలవంతంగా అరెస్ట్ చెయ్యడం.. అలాగే పవన్ ని కూడా అరెస్ట్ చేస్తారనే వార్తలు రావడం తెలిసిందే..

ఈ నేపథ్యంలో పవన్ కోపం నషాళానికంటింది.. ప్రసంగిస్తూ.. కాలికున్న చెప్పు తీసి చూపిస్తూ.. ‘‘చెప్పుతీసుకుని పళ్లు రాలగొడతా కొడకల్లారా ఒకొక్కడికి చెప్తున్నా.. ఒరేయ్ వెధవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా’’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు పవన్. అధికార పార్టీ నాయకులను ఉద్దేశించి తన స్టైల్లో పవన్ వార్నింగ్ ఇస్తున్న ఈ వీడియో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus