Pawan Kalyan: పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?
- February 28, 2024 / 09:39 PM ISTByFilmy Focus
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో జనసేన నుంచి పోటీ చేసే మిగత అభ్యర్థుల జాబితాను సైతం పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్మారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 100 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను పవన్ అమ్మారంటూ వైరల్ అవుతున్న వార్తల సారాంశం.
ఎన్నికల వల్ల పార్టీకి సంబంధించిన ఖర్చులు పెరగడంతో పవర్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఆస్తులు అయితే అమ్మలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఎన్నికల సమయానికి అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని కౌలు రైతుల కోసం ఖర్చు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించరని ఆయన సన్నిహితులు సైతం చెబుతారు.

పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో తను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మెజారిటీ స్థానాలలో పార్టీని గెలిపించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సినిమాలలో కూడా పవన్ కు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో మెజారిటీ సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా రిలీజ్ కానున్నాయని ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవన్ (Pawan Kalyan) కథల ఎంపికలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఏడాదే పవన్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ కానుంది. సినిమాల్లో, రాజకీయాల్లో పవన్ సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లానింగ్స్ సైతం వేరే లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

















