Pawan Kalyan: పాన్ ఇండియా ఇమేజ్ కోసం అలా చేస్తున్న పవన్!

స్టార్ హీరో ప్రభాస్ కు ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉంది. ప్రభాస్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడంతో పాటు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లను సాధిస్తుందని నిర్మాతల్లో నమ్మకం ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, చరణ్ లకు ఆర్ఆర్ఆర్ మూవీతో ఈ గుర్తింపు దక్కనుంది. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఏప్రిల్ నెల 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీకి ఈ సినిమా రిలీజయ్యే పరిస్థితి లేదు. ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా సగం షూటింగ్ పెండింగ్ లో ఉంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. అయితే ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని దర్శకుడు క్రిష్ తో కలిసి ఈ సినిమాకు సంబంధించిన సీన్లు బెస్ట్ గా వచ్చేలా చర్చలు జరుపుతున్నారని సమాచారం.

పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లో విడుదల కానున్నాయి. ఇప్పటికే విడుదలైన హరిహర వీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచాయి. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో రిలీజవుతున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

క్రిష్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని సమాచారం. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ మార్కెట్ ను పెంచే సినిమాలకు ఓకే చెబుతున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus