పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస సినిమాలు లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో చిత్రబృందం బిజీగా గడుపుతోంది. మరోపక్క పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటూనే సమాంతరంగా.. ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ని బట్టి పవన్ క్యారెక్టర్ ఎలా వుండబోతుందనే విషయంలో క్లారిటీ వచ్చింది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ ప్రకారం పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని తెలుస్తోంది. దీనికోసం పవన్ ‘షావోలిన్’ అనే పేరుగాంచిన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. సినిమాలో ఈ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుందని.. పవన్ ఫ్యాన్స్ కి ఈ యాక్షన్ సీన్స్ విజువల్ ఫీస్ట్ గా ఉంటాయని చెబుతున్నారు.
ఈ చిత్రం షూటింగ్ కోసం చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు. రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. జూలై నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. 2022 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Most Recommended Video
వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!