ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రత్యేక హోదా విషయం కొన్ని రోజులుగా నలుగుతోంది. స్పెషల్ స్టేటస్ కావాలని “ప్రత్యేక హోదా సాధన సమితి” అధ్యక్షుడు శివాజీ కొంతకాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ రావాలంటే. ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) రోడ్డు మీదకు వస్తే, నిముషాలలో ‘స్పెషల్ స్టేటస్’ వస్తుందని కొన్ని రోజుల క్రితం శివాజీ చెప్పారు. అయితే “స్పెషల్ స్టేటస్” విషయంలో తానేమీ చేయగలిగింది లేదు, ఢిల్లీ వెళ్లి పోరాడినా ఫలితం ఉండదని పవన్ కళ్యాణ్ తాజాగా చెప్పడంతో శివాజీ పవన్ ని పక్కన పెట్టారు.
ప్రత్యేక హోదా విషయంలో పవన్ ఏమీ చేయలేరని గ్రహించిన శివాజీ అతన్ని ఏ విధంగా విమర్శించకుండా.. వెంకయ్య నాయుడిపై బాణం ఎక్కు పెట్టారు. ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు రాజీనామా లేఖ పంపిస్తే, కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని శివాజీ అభిప్రాయపడ్డారు. నిజానికి ఏపీకి జరుగుతున్న అన్యాయంలో కీలక పాత్రలు పోషించేది వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలేనని ఆరోపించారు. వెంకయ్య గారు గనుక రాజీనామా చేస్తే అది దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీస్తుందని, తద్వారా ఏపీకి హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శివాజీ ఆలోచన బాగుంది.. కానీ ఆచరిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేము.