పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ కెరియర్ పట్ల అదేవిధంగా రాజకీయాల పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఈయన జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల పరంగా కూడా బిజీ అవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది మొదట్లోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. దీంతో వరుస రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు ఈయన సినిమాలకు కమిట్ అయి దాదాపు సగం సినిమాలను షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఒకవైపు సినిమా షూటింగ్లో పాల్గొంటున్న మరోవైపు రాజకీయాలలో బిజీ అవుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అన్నింటికి కూడా బ్రేక్ ఇచ్చి రాజకీయాల పైన ఫోకస్ పెట్టారని తెలుస్తుంది ఇక ఈ సినిమాలన్నీ కూడా ఎలక్షన్స్ తర్వాతనే పూర్తి కాబోతున్నాయని తెలుస్తోంది. ఇటీవల నారా లోకేష్ పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా పెద్ద ఎత్తున సభను నిర్వహించి ఆ కార్యక్రమంలో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇలా రాజకీయపరంగా ఈయన ఎన్నో బిజీ షెడ్యూల్ ప్లాన్ చేశారు అయితే ఉన్నఫలంగా గత రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఈయన గత రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్న పవన్ తన షెడ్యూల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. రాజకీయాల పరంగా పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటిని కూడా వాయిదా వేసారని తెలుస్తుంది.
అయితే కొద్దిరోజుల పాటు ఈయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉండగా ఎక్కువ కాలం పాటు విశ్రాంతి తీసుకోకుండా త్వరలోనే తిరిగి తన రాజకీయ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అస్వస్థతో ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో ఈయన ఎన్నికల షెడ్యూల్లో బిజీ అవుతున్నారు. ఈయన పూర్తిగా కోలుకొని త్వరలోనే తిరిగి ప్రజలలోకి రాబోతున్నారు.