ఫైనల్ గా క్రిష్ కి డేట్స్ ఇచ్చిన పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో పవన్, శృతిల కాంబినేషన్ లో వచ్చే డ్యూయెట్ కోసం చిత్రబృందం పొల్లాచి వెళ్లనున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ పాటను సినిమా నుండి తీసేశారని సమాచారం. కేవలం ఒక్క మాంటేజ్ సాంగ్ మాత్రమే చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి కావడంతో దర్శకుడు క్రిష్ సినిమా మీదకు రాబోతున్నారు పవన్. ఇప్పటికే క్రిష్ సినిమాకి సంబంధించి ఓ భారీ సెట్ ను నిర్మించారు. అక్కడ కొంచెం వర్క్ పూర్తి చేసేస్తా ఆ సెట్ తో పని అయిపోతుంది. అందుకే ముందుగా ఆ వర్క్ పూర్తి చేసి ఆ తరువాత ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను మొదలుపెడతారట పవన్. అయితే అది ఎప్పటినుండి అనే విషయంలో క్లారిటీ లేదు.

అందుకే ఈ రీమేక్ కోసం అనుకున్న సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, జయరాం లాంటి నటులు ఎవరితోనూ అగ్రిమెంట్లు ఇంకా చేయలేదు. డేట్లు పక్కాగా ఫిక్స్ అయితే తప్ప అగ్రిమెంట్లు చేసుకోలేరు. ఈ సినిమాలో రానా సెకండ్ హీగా కనిపించనున్నారు. పవన్, రానా కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus