ఐతే మహేష్ ని క్రాస్ చేసిన ఎన్టీఆర్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిన్న ట్విటర్ వేదికగా పెద్ద పండుగ జరుపుకున్నారు. టాలీవుడ్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన సింహాద్రి మూవీ విడుదలై 17ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేశారు. సింహాద్రి మూవీ యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి ఆల్ టైం రికార్డు నెలకొల్పాలని చూశారు. వరల్డ్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీని కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ రికార్డు బ్రేక్ చేయలేక పోయారు.

మూవీ యానివర్సరీ ట్యాగ్ ట్రెండింగ్ లో గబ్బర్ సింగ్ 13.4 మిలియన్ ట్వీట్స్ తో టాప్ లో ఉంది. పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ఉన్న గబ్బర్ సింగ్ ఇటీవల 8ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ యానివర్సరీ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేశారు. దీనితో టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ మూవీ యానివర్సరీ ట్యాగ్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇక నిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సింహాద్రి మూవీ యానివర్సరీ ట్రెండ్ లో 8.8 మిలియన్ ట్వీట్స్ తో రెండవ స్థానానికి పరిమితమయ్యారు.

గబ్బర్ సింగ్ రికార్డు బ్రేక్ చేయాలని వారు ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. ఐతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ బాబు పోకిరి యానివర్సరీ ట్రెండ్ రికార్డు దాటివేశారు. 14 ఇయర్స్ పూర్తి చేసుకున్న పోకిరి యానివర్సరీ ట్యాగ్ ని మహేష్ ఫ్యాన్స్ భారీగా ట్రెండ్ చేసి 8.4 మిలియన్ ట్వీట్స్ చేయడం జరిగింది. పోకిరి రికార్డు బ్రేక్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ తర్వాత సెకండ్ ప్లేస్ కి సింహాద్రిని తీసుకెళ్లారు. మరి ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ బాహుబలి నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ వీరి రికార్డ్స్ బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus