Harish Shankar: పవన్ తోనే కాదు రవితేజతో కూడా వెయిటింగ్ తప్పదు!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’ తర్వాత మరో సినిమా చేయలేదు.’గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదలుపెట్టాడు. షూటింగ్ మొదలైంది.ఓ గ్లిమ్ప్స్ కూడా వదిలారు. అయితే 2020 లో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తే ఈ ఏడాది అంటే 2023 లో స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాని ఇప్పట్లో కంప్లీట్ చేసే ఆలోచన పవన్ కళ్యాణ్ కి లేదు. ఎందుకంటే ఈ సినిమా ఫ్యాన్స్ కి పక్కా ఫీస్ట్ లాంటిది.

అలాగే ఇందులో పొలిటికల్ అంశాలు కూడా ఉన్నాయి అని వినికిడి. సో ఈ టైంలో కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం ఖాయం. కాబట్టి ఈ సినిమాని హోల్డ్ లో పెట్టి .. మిగిలిన ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే హరీష్ ను వెయిట్ చేయించకుండా .. ఓ సినిమా చేసుకురమ్మని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రవితేజ.. (Harish Shankar) హరీష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కాకపోతే రవితేజ ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వర రావు’ అలాగే ‘ఈగల్’ అనే సినిమాలు చేస్తున్నాడు. మరోపక్క గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.ఎంత ఫాస్ట్ గా చేసినా.. వీటిని ఫినిష్ చేయడానికి కనీసం 7 , 8 నెలలు టైం పడుతుంది. కాబట్టి .. హరీష్ కి ఇలా కూడా వెయిటింగ్ తప్పదు అనే చెప్పాలి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus