పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో మెయిన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని .. ఈ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఒరిజినల్ తో పోలిస్తే స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసాడు త్రివిక్రమ్.
ఆయన ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ అలాగే మార్కండేయ సాంగ్ కి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉండగా.. చాలా మంది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడని..ఇది ‘గోపాల గోపాల’ లాంటి సినిమా అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇందులో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించడం లేదు.
ఈ విషయం ఒరిజినల్ చూసిన వారికి తెలుస్తుంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు సముద్రఖని క్లారిటీ ఇచ్చాడు. ‘పవన్ ఇందులో దేవుడి పాత్రలో కనిపించడం లేదు. కాలం ఓ రూపాన్ని ధరించి వస్తే ఎలా ఉంటుందో అలా కనిపించబోతున్నారు. దేవుళ్ళకే కాలం అనేది చాలా కష్టాలు పెట్టింది. రాముడు, కృష్ణుడు వంటి వారికి కష్టకాలం వచ్చింది. కాలం ముందు మనుషులు మాత్రమే కాదు దేవుళ్ళు కూడా ఒకటే. సినిమా చూస్తే అది మరింతగా క్లారిటీ వస్తుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.