తమ్ముడి రాకతో మెగాస్టార్ ఇంట్లో సందడి

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు 63వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా అతనికి అనేకమంది శుభాకాంక్షలు చెప్పారు. ఎంతమంది శుభాకాంక్షలు చెప్పినప్పటికీ ఆత్మీయుల పలకరింపు ఆనందాన్ని ఇస్తాయి. చిరు అత్యంత ప్రేమించే వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ రాజకీయాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పవన్ అన్నకి కొంచెం దూరం అయ్యారు. కానీ ఆ దూరం ఎక్కువకాలం నిలవలేదు. ఇద్దరూ కలిసి పోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్, తన భార్య లెజెనోవా, పిల్లలతో కలసి అన్నయ్య ఇంటికి వెళ్లారు. పూల బొకే ఇచ్చి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తమ్ముడి కుటుంబం ఇంటికి రాగానే చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కలిసి కూర్చొని మాట్లాడుకోవడమే కాదు కలిసి భోజనం చేశారు. అన్నదమ్ములిద్దరూ ఒకే చోట చేరడంతో… మెగా అభిమానుల ఆనందం రెట్టింపయింది. ప్రస్తుతం చిరు సైరా నరసింహా రెడ్డి సినిమా పనుల్లో బిజీగా ఉండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల కష్టాలు తెలుసుకోవడంలో గడుపుతున్నారు. ఇదివరకు అన్న రాజకీయాల్లో వచ్చి దెబ్బతిన్నారు.. ఆ అనుభవాన్ని తమ్ముడు పాఠం గా నేర్చుకొని ప్రత్యర్థులకు మెగా దెబ్బ చూపించబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus