Badri Re-Release: పవన్ సినిమాల విషయంలో ఆ పొరపాటు జరుగుతోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. సినిమా కథ విని ఆ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ అంచనా వేయగలరు. పవన్ ఎక్కువ సంఖ్యలో రీమేక్ సినిమాలలో నటించినా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించిన సంగతి తెలిసిందే. పవన్ సినిమాలైన జల్సా, ఖుషి సినిమాలు రీరిలీజ్ లో కూడా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.

పవన్ బద్రి మూవీ కూడా ఈ నెల 26వ తేదీన రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. అయితే కొన్ని వారాల గ్యాప్ లోనే పవన్ సినిమాలు రీరిలీజ్ కావడం వల్ల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బద్రి సినిమాను రీరిలీజ్ చేయడం విషయంలో ఫ్యాన్స్ ఏ మాత్రం హ్యాపీగా లేరు. ఖుషి సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు రావడంతో బద్రి మూవీని రీరిలీజ్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తన సినిమాల రీరిలీజ్ విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. నెలకో సినిమా చొప్పున విడుదల చేస్తే రీరిలీజ్ అయిన సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపే అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తైతే పవన్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది సమ్మర్ లో హరిహర వీరమల్లు విడుదలవుతుందని వార్తలు వినిపించినా ఆ సమయానికి ఈ సినిమా విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus