Bro Trailer: అంచనాలు పెంచేసిన ‘బ్రో’ ట్రైలర్.. ఫ్యాన్స్ కి ఫీస్టే!

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ కాంబినేషన్లో రూపొందిన ‘బ్రో’ సినిమా జూలై 28 న విడుదల కాబోతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ కి ఈ చిత్రం రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఒరిజినల్ ను తెరకెక్కించిన సముద్రఖని.. ‘బ్రో’ ని కూడా డైరెక్ట్ చేయడం విశేషం.’పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రానా, రెండు పాటలకి మాత్రం యావరేజ్ రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

ఇక బజ్ ను పెంచడానికి ట్రైలర్ అప్డేట్ ను కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. జూలై 22 న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ‘బ్రో’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. వారు చెప్పినట్టుగానే కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను లాంచ్ చేశారు. 2 నిమిషాల 15 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ …’భస్మాసురుడు అని ఒకడుండేవాడు తెలుసా.. మీ మనుషులంతా వాడి వారసులు.

ఎవడి తల మీద వాడే పెట్టుకుంటారు’ అంటూ పవన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా.. వారి సమస్యలు పట్టించుకోకుండా తిరిగే మార్క్ .. చనిపోతే.. టైం అతనికి మరో అవకాశం ఇస్తున్నట్లు ట్రైలర్ చెబుతుంది. బ్రో (Bro) ట్రైలర్ లో అన్ని అంశాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్, రొమాన్స్, బ్రహ్మానందం కామెడీ.

చివర్లో తన పాత పాటలతో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ చిందేయడం.తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. త్రివిక్రమ్ రాసిన డైలాగులు బాగా పేలాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసే విధంగా ఈ ట్రైలర్ ఉందని చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus