Pawan Kalyan: జోరు చూస్తుంటే కచ్చితంగా అనుకున్న డేట్‌కి పవన్‌ వచ్చేలా ఉన్నాడే..

పవన్‌ కల్యాణ్‌  (Pawan Kalyan) రాజకీయ నాయకుడిగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా మారిపోయాక సినిమాల షూటింగ్‌ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. కొత్త సినిమాలు ఓకే చేయకుండా ఉండి ఉంటే ఫర్వాలేదు. అప్పటికే మూడు సినిమా సెట్స్‌ మీద ఉంచడంతో అవి వేగంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాలు ఎప్పుడొస్తాయో అనే ప్రశ్న మొదలైంది. అయితే, తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అయితే.. ‘హరి హర వీరమల్లు’  (Hari Hara Veera Mallu)  సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది అని అంటున్నారు.

Pawan Kalyan

ఈ మేరకు త్వరలో ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణలో పవన్‌ కల్యాణ్‌ అడుగుపెడతారు అని సమాచారం. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్నా పవన్‌ కల్యాణ్‌ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అవవ్వగానే పవన్‌ సీన్స్‌ ఉంటాయి అని చెబుతున్నాయి. కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో చేపడతారట. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం ఓ యోధుడు సాగించిన పోరాటమే ‘హరి హర వీర మల్లు’.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), బాబీ దేవోల్‌ (Bobby Deol) , నోరా ఫతేహి(Nora Fatehi), నర్గీస్‌ ఫక్రీ (Nargis Fakhri) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంత భాగం క్రిష్‌ (Krish Jagarlamudi)   దర్శకత్వం వహించగా.. ఇప్పుడు జ్యోతికృష్ణ  (Jyothi Krishna ) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా తొలి పార్టు ‘స్వోర్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేసింది. ఇప్పుడు చెబుతున్నట్లు షూటింగ్‌ తుది దశకు వచ్చినట్లయితే ఆ డేట్‌కి రావడం పక్కా అని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాను తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పారు. ఒకవేళ పవన్‌ కల్యాణ్‌ ‘వీరమల్లు’గా మార్చి 28న రావడం పక్కా అయితే మిగిలిన సినిమాల డేట్లు మారుతాయి. ఎందుకంటే విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)  – గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Tinnanuri) అప్పుడే రావాలని ఫిక్స్‌ అయ్యారు. ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా అదే డేట్‌ మీద కన్నేశాడు అనే ఆ మధ్య వార్తలొచ్చాయి.

 ‘పుష్ప 2’ సీజన్‌.. ‘పుష్ప 1’ను గుర్తు చేసుకున్న రష్మిక మందన.. ఫొటోలతో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus