OG Movie: సంక్రాంతి లెక్కల్ని మార్చబోతున్న పవన్.. జరగబోయేది ఇదేనా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ వరుస షూటింగ్ లతో బిజీ అవుతున్నారు. ఓజీ మూవీ షూటింగ్ బ్యాంకాక్ లో జరగనుండగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఎక్కువ సంఖ్యలో డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. నవంబర్ లో కూడా ఈ సినిమా షూట్ లో పవన్ పాల్గొననున్నారని సమాచారం. మొదట ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతి రేసులో నిలుస్తుందని వార్తలు వినిపించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయడం సులువు కాదు.

అందువల్ల సంక్రాంతికి ఓజీ (OG Movie) సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ హీరోలు సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేస్తామని ఫిక్స్ అయ్యారు. గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా ఓజీ కూడా సంక్రాంతికి ఫిక్స్ అయితే మూడు నుంచి నాలుగు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సిందేనని చెప్పవచ్చు.

ఆ సినిమాలను సంక్రాంతికే విడుదల చేయాలని ఫిక్స్ అయినా పవన్, మహేష్ సినిమాలకే థియేటర్లలో మొదటి ప్రాధాన్యత ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలను పండుగల సమయంలో రిలీజ్ చేస్తే యావరేజ్ టాక్ వచ్చినా సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమాకు దానయ్య నిర్మాత కాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. పవన్ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus