పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 3 సినిమాలు ఫినిష్ చేయాలి. అవే ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ‘ఓజి’ (OG Movie) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తుండటం వల్ల బిజీగా గడుపుతున్నారు. దీంతో ఆయనకు పెండింగ్ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి టైం దొరకడం లేదు. ముందుగా ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ మొదలై 5 ఏళ్ళు దాటింది. ఇంకా ఆ సినిమా రిలీజ్ కాలేదు.
ఇప్పటికే 5,6 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఎట్టకేలకు మే 9న ఫిక్స్ అన్నారు. కానీ ఈసారి కూడా రిలీజ్ కష్టమనే టాక్ వినిపిస్తుంది. ఆ డేట్ ని వేరే చిన్న, చితక సినిమాలు ఆకుపై చేసుకునే పనిలో ఉన్నాయి. మరోపక్క ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన ప్రైమ్ వీడియో సంస్థ… వారితో అగ్రిమెంట్ చేసుకున్న టైంకి సినిమా రిలీజ్ చేయడం లేదు అని.. సగం పేమెంట్ వెనక్కి ఇచ్చేయమని మేకర్స్ కి నోటీసులు పంపారట.
అయితే పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ కి ప్రమాదం జరగడంతో.. వాళ్ళు మరో 2 నెలలు టైం ఇచ్చినట్లు తెలుస్తుంది.ఆ రకంగా జూన్ 24న ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పవన్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజి’ సినిమాను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట. ఈ సినిమా కోసం మరో 5 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వాలి.
నిర్మాత ఒత్తిడి చేస్తుండటంతో అందుకు.. పవన్ దిగొచ్చినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 5న ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్టు సమాచారం. పవన్ అభిమానుల ఆకలి తీర్చే సినిమా ‘ఓజి’ అని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగి సెప్టెంబర్ 5 కి సినిమా రిలీజ్ అయితే అభిమానులకి అంతకంటే కావాల్సింది ఏముంటుంది.