పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయని సమాచారం. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి షెడ్యూల్ ను ప్రకటించారు. జూన్ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుకానుంది. అన్నవరం నుంచి భీమవరం వరకు పవన్ కళ్యాణ్ తొలి విడత యాత్రలో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది.
ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పొలిటికల్ కార్యక్రమాలలో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. అన్నవరంలో పూజలను నిర్వహించి వారాహి కార్యక్రమాలను మొదలుపెడతారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా షూటింగ్ లకు బ్రేక్ తీసుకోనున్నారని తెలుస్తోంది. పవన్, సాయితేజ్ కలిసి నటించిన బ్రో మూవీ వచ్చే నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
వినోదాయ సిత్తం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బ్రో మూవీతో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ సాధిస్తారని అబిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రోజుకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పవన్ డిమాండ్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పవన్ ను (Pawan Kalyan) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు రీమేక్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు స్ట్రెయిట్ సినిమాలలో నటిస్తున్నారు. పవన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఎక్కువగా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. గాజువాక లేదా భీమవరం లేదా పిఠాపురం నుంచి పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.