Payal Ghosh, Jr NTR: ఎన్టీఆర్‌ గురించి పాయల్‌ కామెంట్స్‌ వైరల్‌!

రెండేళ్ల క్రితం… ‘ఊసరవెల్లి’ నటి పాయల్‌ ఘోష్‌ ఎన్టీఆర్‌ గురించి, సౌత్‌ సినిమాల గురించి గొప్పగా మాట్లాడింది. దక్షిణాది సినిమాలు రాజ్యమేలే రోజులు వస్తాయని, అక్కడి నటులు తమ ప్రతాపం చూపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చింది. అయితే అప్పుడు ఆమెను నెటిజన్లు విమర్శించారు. సౌత్‌ సినిమా బాలీవుడ్‌ సినిమాను ఢీకొట్టడమా అని అన్నారు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది అంటోంది పాయల్‌ ఘోష్. ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది అంటూ ఇటీవల దీపిక పడుకొణె మాట్లాడిన విషయం తెలిసిందే.

Click Here To Watch

దీపిక మాటల్ని షేర్‌ చేస్తూ పాయల్‌ ఘోష్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేసింది. అందులో భాగంగా ‘‘చూశారా… బాలీవుడ్‌ టాప్‌ నటీమణులు తారక్‌తో పని చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే నేను ఎన్టీఆర్‌తో కలసి నటించాను’’ అంటూ రాసుకొచ్చింది. దీంతోపాటు నేను 2020లో ఇదే మాట చెప్పాను. దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌ను తీసిపోకుండా తెరకెక్కుతున్నాయని చెప్పాను. అప్పుడు నన్ను కొందరు విమర్శించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే. నేను చెప్పింది నిజమవుతుంది. బాలీవుడ్‌ను దక్షిణాది సినిమాలు ఓవర్‌టేక్‌ చేస్తాయి అని ట్వీట్‌లో రాసుకొచ్చింది.

దీపిక పడుకొణె ఇద్దరు టాలీవుడ్‌ స్టార్లను తెగ మెచ్చేసుకుంది. వాళ్లతో నటించాలని ఉంది అంటూ మనసులో మాట చెప్పేసింది. దీంతో ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం దీపిక ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మీకు బాగా నచ్చిన హీరోలు ఎవరు? అని అడగ్గా… ‘పుష్ప’ స్టార్‌ అల్లు అర్జున్‌, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరో ఎన్టీఆర్‌ అంటే చాలా అభిమానం అని చెప్పింది. తారక్‌ చాలా మంచి వ్యక్తి, ఆయన పర్‌ఫార్మెన్స్‌, డైలాగ్‌ డెలివరీ చాలా బాగుంటాయి.

తారక్‌ను చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను అని కూడా చెప్పింది దీపిక. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేయాలని ఉంది అని చెప్పింది. దీంతో ఆ మాటల్ని పట్టుకొని ఇప్పుడు పాయల్‌ ఘోష్‌ ట్వీట్‌ చేసింది. నిజమే కదా పాన్‌ ఇండియా రూపంలో మన సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus