Payal Rajput: విమర్శలకు దారి తీసిన పాయల్ లేటెస్ట్ కామెంట్స్.!

పాయల్ (Payal Rajput) రెండు, మూడు రోజులుగా హాట్ టాపిక్ అవుతుంది. ప్రభాస్ ‘సమ్ వన్’ పోస్ట్ వల్ల ఈమె బాగా ట్రెండ్ అయ్యింది. ఆ వెంటనే ఓ నిర్మాత పై నెగిటివ్ కామెంట్స్ చేసి.. పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. ‘నీ ఒంపు సొంపులు చూపిస్తే బాగుంటుంది. ‘ప్రేక్షకులు అవే డిమాండ్ చేస్తున్నారు’ అంటూ డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు’ అని మా నిర్మాత నాతో అసభ్యకరమైన భాషలో చెప్పాడు’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఓ సంచలన పోస్ట్ పెట్టింది.

విషయంలోకి వెళితే.. ఆమె ప్రధాన పాత్రలో ‘రక్షణ’ రూపొందుతుంది. ఆ సినిమా దర్శక, నిర్మాత ప్రాణదీప్ ఠాకూర్ పై పాయల్ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ సినిమా 4 ఏళ్ళ క్రితమే మొదలైందట.కానీ కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది.ఇందు వల్ల పాయల్ కి రావాల్సిన రూ.6 లక్షలు నిర్మాత తిరిగి చెల్లించలేదట. ఆ మొత్తంతో పాటు అదనంగా కొంత డబ్బు ఇస్తేనే ప్రమోషన్ కి వస్తాను అంటూ పాయల్…

ఠాకూర్ కి తెగేసి చెప్పిందట. ‘మా’ దృష్టికి ఈ విషయాన్ని ఆమె మార్చిలోనే తీసుకెళ్లడం వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కానీ ఇప్పుడు రిలీజ్ టైంకి ఆమె నిర్మాతపై ఇలాంటి ఎలిగేషన్స్ వేయడం వంటివి డబ్బు కోసమే అని తేలింది. అంతా ఓకే కానీ.. తన క్రేజ్ ని సినిమా కోసం వాడుకోవాలని నిర్మాత చూస్తున్నాడు అంటూ పాయల్ అనడం పై ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తుంది. ఎందుకంటే.. పాయల్ కి ‘ఆర్.ఎక్స్.100 ‘ తర్వాత సరైన హిట్టు పడలేదు.

‘మంగళవారం’ (Mangalavaaram) సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గర వరకు వెళ్ళింది కానీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. పైగా ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ అంటూ ఏదైనా ఉంటే అది డైరెక్టర్ కి అలాగే టెక్నికల్ టీంకి వెళ్ళిపోయింది. పాయల్ కి సరైన కంబ్యాక్ మూవీ అయితే అది అని చెప్పలేం. అలాంటప్పుడు ఈమె క్రేజ్ ను నిర్మాత వాడుకునేది ఏముంటుంది.? పోనీ ఓటీటీ బిజినెస్ కోసం అనుకుందామంటే.. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలకే సరైన ఓటీటీ బిజినెస్ జరగడం లేదు కదా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus