Payal Rajput: ఇంటర్వ్యూ : ‘మంగళవారం’ గురించి పాయల్ రాజ్ పుత్ చెప్పిన ఆసక్తికర విషయాలు.!

‘ఆర్ఎక్స్ 100’ తర్వాత పాయల్ రాజ్‌పుత్,అజయ్ భూపతి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మంగళవారం’. అజ్మల్ అమీర్ కూడా కీలక పాత్ర పోషించారు. ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ‘ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై ఎం.సురేష్ వర్మ,స్వాతి రెడ్డి గునుపాటి, అజయ్ భూపతి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ రాజ్ పుత్ పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. అది మీ కోసం :

ప్ర) ‘మంగళవారం’ జర్నీ ఎలా మొదలైంది?

పాయల్ : ‘ఆర్.ఎక్స్.100’ తర్వాత ‘సార్… నాకు ఒక అవకాశం కావాలి’ అని అజయ్ భూపతి వెంట పడ్డాను. ‘మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా’ అని చెప్పారు. ఫైనల్ గా ఈ సినిమా కోసం ఫోన్ చేశారు. నాకు అజయ్ భూపతి పై నమ్మకం ఎక్కువ . మా ఇంట్లో కూడా అతన్ని ఎక్కువగా నమ్ముతారు. సో నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా యెస్ చెప్పాను.

ప్ర)మీ కంటే ముందు 35 అమ్మాయిలని అజయ్ భూపతి ఆడిషన్ చేశారట. టీనేజ్ గర్ల్ పాత్రకి మిమ్మల్నే తీసుకోవడానికి కారణం?

పాయల్ : అజయ్ గారికి కూడా నా పై నమ్మకం ఉంది. మీరు ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. శైలు అనే పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.

ప్ర) రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మీకు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. ఎలా అనిపిస్తుంది?

పాయల్ : ‘మంగళవారం’ విడుదలకు ఎంత ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నానో… అంతే నెర్వస్ గా కూడా ఉంది. అవుటాఫ్ బాక్స్ సినిమా చేశాం. ఇండియాలో ఈ టైపు క్యారెక్టర్, కథతో ఇప్పటివరకు ఎవరూ సినిమా చేయలేదు.

ప్ర) ఇందులో కూడా మీది నెగిటివ్ రోలా?

పాయల్ : కాదు.నా పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. కచ్చితంగా ఆ అమ్మాయి పాత్ర గుర్తుండిపోతుంది.

ప్ర) ఈ పాత్ర ఛాలెంజింగ్ గా అనిపించిందా?

పాయల్ : ఇందులో నటించడం చాలా కష్టమైంది.కాబట్టి.. ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. రియల్ లైఫ్ లో నాకు, శైలు పాత్రకు 10 పర్సెంట్ కూడా సంబంధం ఉండదు. ఏం ఆలోచించకుండా ఫ్రీగా షూటింగ్ చేయడానికి రమ్మని చెప్పారు. ఆయనపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. చెప్పినట్లు చేశా. సరెండర్ అయిపోయా. క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ కోసం నేను కూడా కొంత రీసెర్చ్ చేశా.

ప్ర) మీ క్యారెక్టర్, నందితా శ్వేతా పాత్రకు సంబంధం ఏంటి?

పాయల్ : నందితా శ్వేతా పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ట్విస్టులతో కూడిన కీలక పాత్ర ఆమెది. అంతకు మించి నేను చెప్పకూడదు. రిలీజ్ కి రెండు రోజులే టైం ఉంది కదా(నవ్వుతూ)

ప్ర) ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. దీనిని లేడీ ప్రొడ్యూసర్ నిర్మించడం జరిగింది. ఎలా అనిపించింది?

పాయల్ : చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. షూటింగ్ టైములో స్వాతి రెడ్డి గునుపాటిని కలవలేదు. కానీ, ఫోన్ లో మాట్లాడాను. స్వాతి గారు, సురేష్ వర్మ గారు… ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్ర) ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యేలా ఉంది?

పాయల్ : అందులో డౌటే లేదు. ‘కాంతార’ అజనీష్ సంగీతం అందించడం చాలా సంతోషంగా అనిపించింది. టాలెంటెడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారు.

ప్ర) కార్తికేయకి జోడీగా మళ్ళీ సినిమా చేస్తారా?

పాయల్ : కార్తికేయతో చెప్పాను. మళ్ళీ మనం కలిసి సినిమా చేద్దామని! మంచి కథ వస్తే చెబుతానని అన్నాడు.దానికి అన్నీ కుదరాలి!

ప్ర) ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టేజి మీద అల్లు అర్జున్ తో సెల్ఫీలు తీసుకున్నారు. ఆయన మీతో ఏం చెప్పారు?

పాయల్ : అల్లు అర్జున్ గారికి ఈ సినిమా కథ ముందే తెలుసు. కాబట్టి.. (Payal Rajput) ‘పాయల్… నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు’ అని చెప్పారు. అది నాకు హ్యాపీగా అనిపించింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus