నిజంగా ‘ఆర్.డి.ఎక్స్’ బాంబులానే ఉందే..!

చేసిన మొదటి మొదటి చిత్రంతోనే క్రేజ్ సంపాదించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఈ ఫీట్ ను సాధించిన వాళ్ళు చాలా అరుదు. ఆ లిస్ట్ లో ముంబై భామ పాయల్ రాజ్ పుత్ కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి… మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రంకి 75 శాతం క్రెడిట్ ఈ భామే కొట్టేసింది. గ్లామర్ తోనే కాదు నటన తో కూడా ఈ భామ మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఈ భామకు ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

సినిమాలతోనే కాదు సోషల్ మీడియాను ఈ భామ షాక్ చేస్తుంటుంది. తన హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకి హీటెక్కిస్తుంటుంది. ఇప్పుడు కూడా ఓ ఫోటోని షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఒక వైపుకు చూస్తూ ఒక హాట్ హాట్ పోజిచ్చింది. ఈ ఫోటో చూస్తుంటే ముంబై భామే అయినప్పటికీ కేరళ కుట్టిలా కనిపిస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక పాయల్ ప్రస్తుతం ‘వెంకీమామ’ అలాగే ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ చిత్రంలో కూడా నటిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కూడా ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ చిత్రం లోనిదే. ఈ ఫోటో చూస్తుంటే ‘నిజంగా ‘ఆర్.డి.ఎక్స్’ బాంబు లానే ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు.

1

2

3

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus