ఇది నిజమైతే పాయల్… బంపర్ ఆఫర్ కొట్టినట్టే…!

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. మొదటి చిత్రంతోనే నటనతోనూ అలాగే గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. అయితే ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో తెచ్చుకున్న గుర్తింపుతో ఈమెకు వరుస అవకాశాలు రావడం గ్యారెంటీ అనుకుంటే.. అలా జరగలేదు. ‘వెంకీమామ’ ‘డిస్కో రాజా’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించినా ఈమెకు కలిసి రాలేదు. ఈమెకు ‘ఆర్.ఎక్స్.100’ వంటి గ్లామర్ మరియు లిప్ లాక్ లు ఎక్కువ ఉన్న సినిమాలే వస్తున్నాయట.

ప్రస్తుతం చిన్న సినిమాల్లో నటిస్తున్న పాయల్.. ఇప్పుడు ఏకంగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మొదలైనప్పటి నుండీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఈ ఏడాది ‘ఇండియన్ 2’ సెట్లో ప్రమాదం జరిగి కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ కూడా గాయాల పాలయ్యాడు. ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి.. ఎలాగూ షూటింగ్ చేసే అవకాశం లేదు. లాక్ డౌన్ ముగిసాక మాత్రం..

ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారట. ఈ పాటలో పాయల్ రాజ్ పుత్ కనిపించనుంది అని తెలుస్తుంది. ఈ పాట సినిమాలోనే హైలెట్ గా నిలుస్తుందట. ఒకవేళ అది నిజమే అయితే పాయల్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే అని చెప్పాలి. శంకర్ సినిమాలో ఒక సాంగ్ లో నటించినా ఇండియన్ లెవెల్లో పాపులర్ అయిపోవచ్చు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రకంగా చూసుకుంటే.. పాయల్ లక్కీ అనే చెప్పాలి.

Most Recommended Video

జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus