ప్రభాస్ సినిమాలో ఆర్.ఎక్స్ 100 బ్యూటీ ఐటెమ్ సాంగ్ గురించి క్లారిటీ

రెండ్రోజులుగా సాహో సినిమాలో పాయల్ రాజ్ పుట్ స్పెషల్ సాంగ్ అనే వార్త హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో కలిసి స్టెప్పులేసే అవకాశం దక్కించుకోవడం అంటే పాయల్ రేంజ్ పెరిగినట్లేనని ఆమె అభిమానులు కుష్ అయిపోతే.. సాహోకి మంచి స్పైస్ యాడ్ అయ్యిందని సినిమా ఫ్యాన్స్ ఆనందపడిపోయారు. కానీ.. ఆల్రెడీ 70% షూటింగ్ పూర్తయిన సినిమాలో పాయల్ స్పెషల్ సాంగ్ యాడ్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నించారు. అయితే.. సుజీత్ కూడా సినిమాలో పాయల్ సాంగ్ ఉండబోయేది లేదని క్లారిటీ ఇచ్చాడు.

దాంతో ఆర్ ఎక్స్ 100 పాప సాహో సినిమాలో కనిపించేది లేదనే కారిటీ వచ్చేసింది. ఆల్రెడీ శ్రద్ధాకపూర్ లాంటే బాలీవుడ్ సూపర్ బ్యూటీని పెట్టుకొని.. “సాహో” లాంటి భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ కి పాయల్ అందాలు ప్లస్ అవుతాయని అనుకోవడం కూడా తప్పే. సాహో టీజర్ ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ రూమర్స్ బదులు ఆ టీజర్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చినా బాగుండేది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus