Peddha Kapu 1 Collections: ‘పెదకాపు 1’ మొదటి వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు 1 ‘ చిత్రం సెప్టెంబర్ 29న రిలీజ్ అయ్యింది. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన బావమరిది విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. టీజర్, ట్రైలర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. మొదటి రోజు ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది.

ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ తీసేస్తే ఆకట్టుకునే అంశం సినిమాలో ఒక్కటి కూడా లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు.దీంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.23 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.15 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.06 cr
గుంటూరు 0.07 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.09 cr
ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.01 cr (షేర్)

‘పెదకాపు 1’ (Peddha Kapu 1) చిత్రానికి రూ.7.25 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.01 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.99 కోట్లు షేర్ ను రాబట్టాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus