Peddha Kapu: భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పెదకాపు మూవీ.. ఆ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందా?

విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన పెదకాపు1 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. స్కంద, చంద్రముఖి2 సినిమాలకు పోటీగా ఈ నెల 29వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

అఖండ సినిమా నిర్మాత నిర్మించిన సినిమా కావడంతో ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పెదకాపు1 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో తెలియాల్సి ఉంది. శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఈ సినిమాతో తనకు పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో విజయం దక్కితే శ్రీకాంత్ కు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.

శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు పరిమితంగా పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల తన సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

బ్రహ్మోత్సవం మూవీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం శ్రీకాంత్ అడ్డాల కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. చాలామంది స్టార్ హీరోలు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ అంటే రిస్క్ అని భావిస్తున్నారు. పెదకాపు1 సినిమాలో శ్రీకాంత్ అడ్డాల నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించారు. ఈ సినిమా (Peddha Kapu ) సక్సెస్ సాధిస్తే నటుడిగా కూడా శ్రీకాంత్ అడ్డాల బిజీ అయ్యే అవకాశం అయితే ఉంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus