‘పెద్ది’ ‘RAPO22’ ఒకే కథలు… నిర్మాతలు ఎలా ఓకే చేశారు?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) .. ఇప్పుడు బుచ్చిబాబు  (Buchi Babu Sana) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. వెంకట్ సతీష్ కిలారు (Venkatesh Kilaru) నిర్మిస్తున్న ఈ సినిమాకి (Peddi)  ‘మైత్రి’ అధినేతలైన నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవిశంకర్ (Y .Ravi Shankar)..లు కూడా నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అందులో రామ్ చరణ్ లుక్ అందరికీ షాకిచ్చింది. ఇక ఈ సినిమాలో రాంచరణ్ ఆట కూలీగా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. ఒక పోస్టర్లో రాంచరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకుని కనిపించాడు.

Peddi , RaPo22

దీంతో అది నిజమే అని అంతా అనుకుంటున్నారు. ఇందులో రాంచరణ్.. క్రికెట్ ప్లేయర్ గా మాత్రమే కాదు, కుస్తీ, కబడ్డీ ప్లేయర్ గా కూడా కనిపించబోతున్నాడు. విజయనగరం అనే ఊరిని దేశవ్యాప్తంగా పాపులర్ చేయాలనేది ఇందులో హీరో లక్ష్యమని తెలుస్తుంది. కీలక పాత్రలో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar)  కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ‘మైత్రి’ బ్యానర్లో రామ్ (Ram) కూడా ఒక సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు.పి (Mahesh Babu P) దీనికి దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది గోదావరి నేపథ్యంలో సాగే కథ. ఇందులో కూడా హీరో తన ఊరి కోసం, ఊరి బాగోగుల కోసం పోరాడతాడట. ఈ కథ ప్రకారం కూడా మరో హీరో కావాలి. ఇలా చూసుకుంటే.. చరణ్, రామ్ సినిమాలు (Peddi) ఒకే లైన్ తో రూపొందుతున్నాయా..? చాలా వరకు ఈ 2 కథలు ఒక్కటేనా? అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ఈ డౌట్ నిర్మాతలకి ముందుగానే వచ్చింది. అందుకే రెండు కథలు సేమ్ అవ్వకుండా స్క్రిప్ట్ దశలోనే చర్చలు జరిపి మార్పులు కూడా చేయించుకున్నట్టు టాక్.

‘సికందర్‌’ డిజాస్టర్‌.. బాలీవుడ్‌కే కాదు.. మనకు కూడా పాఠమే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus