గ్రామీణ అందాల “పెళ్లిగోల”
- March 30, 2017 / 01:24 PM ISTByFilmy Focus
వెండితెరపై రిలీజ్ అయ్యే సినిమాలు ఇప్పుడు అరచేతుల్లోనే రిలీజ్ కానున్నాయి. అయితే సినిమా మొత్తం ఒకే సారి కాకుండా వారంవారం ఎంజాయ్ చేసే విధంగా అదే క్వాలిటీతో, అదే వినోదాన్ని వెబ్ సిరీస్ రూపంలో చూడడనున్నాం. వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ వియు వారు అద్భుతమైన కథలతో వెబ్ సిరీస్ ని అందిస్తున్నారు. ఉగాది రోజున కొన్నింటిని రిలీజ్ చేశారు. వాటిలో “పెళ్లిగోల” వెబ్ సిరీస్ ఒకటి. నరుడా డోనరుడా సినిమా ద్వారా నవ్వుల్ని పంచిన దర్శకుడు మల్లిక్ రామ్ ఈ వెబ్ సిరీస్ ని డైరక్ట్ చేశారు.
“లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంలో నటించిన అభిజీత్ దుద్దల, షామిలి సౌందెరాజన్ (చందమామ కథలు”ఫేమ్) లు జోడీగా నటించిన ఈ సిరీస్ గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకొని అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఊహించని ట్విస్టులతో, అడుగడుగునా కామెడీ పంచ్ లతో నిండిన ఈ పది ఎపిసోడ్ల సిరీస్ లో మొదటి సిరీస్ మార్చి నెల 29 న రిలీజ్ అయింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వియు, తమడా మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ నవ్వుల పెళ్లిగోలని మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే www.viu.com లో లాగిన్ అవ్వండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














