అగ్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కి ‘ధమాకా’ తర్వాత సరైన హిట్టు లేదు. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. పవన్ కళ్యాణ్ ‘బ్రో’ కూడా గట్టెక్కించలేకపోయింది. 2024 లో వచ్చిన సినిమాలు కూడా నిరాశపరిచాయి. ‘విశ్వం’ యావరేజ్ గా ఆడినా ‘మిస్టర్ బచ్చన్’ వంటి మిగిలిన సినిమాలు అన్నీ నష్టాలే మిగిల్చాయి. ఓ సందర్భంలో నిర్మాత విశ్వప్రసాద్ ‘మా నష్టాలన్నీ రాజా సాబ్ తీర్చేస్తుంది’ అంటూ కామెంట్ చేయడంతో.. వాళ్ళు ఏ రేంజ్ నష్టాల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారి ఆశలన్నీ ‘రాజా సాబ్’ పైనే ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. కానీ దానికంటే ముందే ‘మిరాయ్’ కూడా వస్తుంది. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఇది కూడా హ్యాపెనింగ్ మూవీనే..! మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఎందుకో నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమా గురించి కాన్ఫిడెంట్ గా చెప్పలేదు.
కేవలం ‘ది రాజాసాబ్’ గురించే చెబుతున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘ది రాజాసాబ్’.. టీజర్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. అందువల్ల ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్స్ బాగా వస్తున్నాయి. ఎంత కాదనుకున్నా సినిమా రూ.200 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశం ఉంది. అలా అని ‘మిరాయ్’ కూడా తక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కాదు. దీనికి కూడా ఆల్మోస్ట్ రూ.100 కోట్లు పెట్టారు.’హనుమాన్’ సినిమా కంటే ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సగం షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. ‘హనుమాన్’ హిట్ అయ్యింది.
దీంతో స్క్రిప్టులో మార్పులు వంటివి చేశారు. ఔట్పుట్ తో ఎందుకో నిర్మాత సంతృప్తిగా లేనట్టు ఉన్నారు.అందుకే ఆగస్టు 1న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని సెప్టెంబర్ 5కి వాయిదా వేశారు. టీజర్ వంటివి బాగున్నా.. సినిమాకి హైప్ తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాయి. అయినప్పటికీ ‘మిరాయ్’ ‘ది రాజాసాబ్’ సినిమాలపైనే ‘పీపుల్ మీడియా’ వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది.