Babu Mohan: విషంతో పాన్ చేసి స్టార్ కమెడియన్ ని చంపాలనుకున్నారట!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా దూసుకుపోయారు బాబు మోహన్. అతడి కామెడీకి ప్రేక్షకులు పడి పడి నవ్వేవారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ ప్రస్తుతం బిజీబిజీగా ఉంటున్నారాయన. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను కొందరు విషం పెట్టి చంపాలని చూశారని సంచలన విషయాలను బయటపెట్టారు.

బాబు మోహన్ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే టీడీపీలో చేరారు. ఆ సమయంలో తనకు జరిగిన ఓ చేదు సంఘటన గురించి ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘వన్స్ మోర్’ అనే సినిమా షూటింగ్ సమయంలో తనికెళ్ల భరణి పాన్ తింటూ తనకు కూడా ఇచ్చారని.. అది నోట్లో పెట్టుకొని వెంటనే ఊసేశానని అన్నారు బాబు మోహన్. కానీ ఆ తరువాత నుండి విచిత్రంగా పాన్ తినడం అలవాటైందని చెప్పారు. సంగారెడ్డిలో ఉన్న ఓ పాన్ డబ్బాలో ఎప్పుడూ పాన్ కట్టించుకొని తినేవాడినని..

రోజులు ముప్పై నుంచి నలభై పాన్ లు తినేవాడినని అన్నారు. ఎప్పటిలానే పాన్ కట్టించుకొని కారులో పెట్టుకొని కొంతదూరం వెళ్లిన తరువాత తిందామని ఓపెన్ చేయగా.. ఆ సమయంలో ఓ మహిళ ఫోన్ చేసి ‘సార్ ఆ పాన్ తినొద్దు.. అందులో విషయం కలిపారు’ అని చెప్పగా.. వెంటనే ఆ పాన్ పడేశానని అన్నారు. ఆ మహిళ మరెవరో కాదు.. తనకు పాన్ కట్టించిన వ్యక్తి భార్యనే అని బాబు మోహన్ గుర్తుచేసుకున్నారు.

కొందరు వ్యక్తులు బెదిరించడంతో పాన్ లో విషయం కలిపినట్లు ఆ మహిళ చెప్పిందని.. తప్పైపోయిందని, క్షమించమని ఏడ్చిందని బాబు మోహన్ తెలిపారు. రాజకీయాలంటే ఇంత దారుణంగా ఉంటాయని అప్పుడు అనిపించిందని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus