సాహో టీమ్ ని ఇబ్బంది పెడుతున్న అనుమతులు

బాహుబలి తర్వాత ప్రభాస్ మరింత కష్టపడుతున్నారు. భారీ విన్యాసాలకు వెనుకాడడం లేదు. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సాహో సినిమాకోసం ప్రభాస్ సాహోసపేతమైన ఫీట్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాకి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతనెలలో దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ వద్ద ఓ భారీ ఫైట్ ని సుజీత్ ప్లాన్ చేశారు. అయితే అక్కడ యాక్షన్ సీన్ చేయడానికి అనుమతులు లభించలేదు. ఆఖరి నిముషంలో షూటింగ్ క్యాన్సిల్ అయింది. దీంతో రామోజీఫిల్మ్ సిటీలోనే లోనే ఆ సన్నివేశాన్ని కంప్లీట్ చేశారు. ఇక దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు తీయాలని అనుకున్నారు. కానీ అందుకు కూడా అనుమతి లభించలేదని తెలిసింది. హైవేల మీద షూట్ చేయడానికి అక్కడ అధికారులు ఒప్పుకోలేదని సమాచారం. 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు.

అది క్యాన్సిల్ అవ్వడంతో చిత్ర బృందం నిరాశ చెందింది. ఇక ఆ సెట్ ని కూడా ఫిలిం సిటీలోనే వేసి.. గ్రాఫిక్స్ తో మేనేజ్ చేయడానికి సిద్ధమయ్యారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 200 కోట్లతో ఈ చిత్రాన్ని వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే, తమిళనటుడు అరుణ్ విజయ్, మల్లూవుడ్ సీనియర్ నటుడు”లాల్” తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో థియేటర్లోకి రానుంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus