‘అఖండ’ విడుదలకి ముందు బాలయ్య నాకు ఫోన్ చేసారు.. ఆయన అబద్దం…. : పేర్ని నాని

నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ సందర్భంలో టికెట్ రేట్ల ఇష్యు గురించి ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి వంటి వారు ఏపి ముఖ్యమంత్రి జగన్ తో జరిపిన మీటింగ్ గురించి స్పందించారు. ‘నేను జగన్ ను కలవను… నా బడ్జెట్ లిమిట్ పెంచను.. టికెట్ రేట్ల ఇష్యు నడుస్తున్న టైములో కూడా నా ‘అఖండ’ సినిమా విడుదలై’ ఘనవిజయం సాధించింది’ అంటూ చెప్పుకొచ్చాడు. బాలయ్య ఈ రకంగా కామెంట్లు చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది.

Click Here To Watch

‘బంగార్రాజు’ సినిమా టైములో నాగార్జున చేసిన కామెంట్లే బాలయ్య కూడా చేయడం అందరినీ ఆలోచనలో పడేసింది. బాలయ్య ముక్కు సూటి మనిషి. ఏది ఉన్నా మొహం మీదే మాట్లాడే స్వభావం. నిజానికి బోయపాటితో తప్ప మిగిలిన ఏ దర్శకుడితో ఆయన సినిమా చేసినా బడ్జెట్ కానీ, బిజినెస్ కానీ ఎక్కువ జరగదు.. కాబట్టి అంతా కన్విన్స్ అయ్యి సరిపెట్టుకున్నారు. కానీ తాజాగా ఏపి సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. ‘

‘అఖండ’ విడుదలకి ముందు బాలయ్య ముహూర్తం చూసుకుని నాకు ఫోన్ చేశారు. తన సినిమాకి టికెట్ రేట్ల ఇష్యు తలెత్తకుండా ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసి మాట్లాడాలి.. అపాయింట్మెంట్ కావాలి అని నన్ను అడిగారు.ఇదే విషయాన్ని జగన్ గారికి చెప్పాను. బాలయ్య గారు నన్ను కలవడం ఎందుకు..! ఆయన క్యారెక్టర్ దెబ్బతింటుంది. ఆయనకి ఏమి కావాలో అది చేసి పెట్టండి అని చెప్పారు.బాలయ్య గారు అబద్దం చెబుతారు అని నేను అనుకోను.

ఆ సినిమా విషయంలో మేము ఏమైనా వేధించామా. ఆ సినిమా నిర్మాతని అడగండి. వేధించాము అంటే మేము బహిరంగంగా క్షమాపణలు చెప్పుకుంటాము’ అంటూ చెప్పుకొచ్చారు.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus