Nagarjuna: నాగ్, బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయాలంటూ పిటిషన్.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ షో తెలుగులో ఇప్పటికే 7 సీజన్లను పూర్తిచేసుకుంది అయితే బిగ్ బాస్ షో పట్ల ప్రతి సీజన్లోనూ ఎంతో వ్యతిరేకత ఏర్పడుతూ ఉండడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలి అంటూ గతంలో ఎన్నోసార్లు కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. ఇక కోర్టు నుంచి కూడా బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు కూడా వెళ్లాయి. ఇటీవల సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా ఎంతో విజయవంతంగా పూర్తి అయింది

కానీ ఈ గ్రాండ్ ఫినాలే ఈరోజు పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకొని బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మరొక కంటెస్టెంట్ అమర్ పట్ల కొంతమంది దారుణంగా ప్రవర్తించారు. దీంతో వీరిద్దరి అభిమానుల మధ్య గొడవ చోటుచేసుకుంది పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీల కార్ల అద్దాలు ధ్వంసమైన సంగతి కూడా తెలిసిందే. కొంతమంది ఏకంగా ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టారు.

అభిమానం పేరిట ఫాన్స్ ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడం పట్ల పలువురు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం నిర్వాహకులపై అలాగే నాగార్జున పట్ల అడ్వకేట్ అరుణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తున్న (Nagarjuna) నాగార్జునతో పాటు ఈ షో నిర్వాహకులను కూడా అరెస్టు చేయాలి అంటూ ఈయన ఈ పిటిషన్ లో తెలియజేశారు. అంతేకాకుండా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న వారిని కూడా విచారించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం పేరిట కొంతమంది కంటెస్టెంట్లను హౌస్ లో దాదాపు 100 రోజులపాటు నిర్బంధం చేయడంపై ఈయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే ఈ విషయంపై మహిళ కమిషన్ చైర్మన్ కి కూడా ఫిర్యాదు చేస్తామని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని కూడా విచారించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వెనుక ఉన్నటువంటి కుట్రను కూడా బయటకు తేవాలి అంటూ ఈయన పేర్కొన్నారు. ఇక ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus