శ్రీనివాస్ అవసరాల.. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాత్రలను చేయమే కాదు.. తాను కథకుడిగా మారి కొత్త కొత్త పాత్రలను రాస్తుంటారు కూడా. అలాగే వాటిని అంతే అందంగా తెరపై చెక్కి వైవిధ్యమైన దర్శకుడిగా పేరు కూడా తెచ్చుకున్నారు. టాలీవుడ్ సినిమాలు వేరు, ఆయన తీసిన సినిమాలు వేరు అని అంటుంటారు టాలీవుడ్ జనాలు. ఎందుకంటే ఆయన రాత, తీత అలా ఉంటాయి మరి. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘పాప’… అదేనండీ ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’.
ఈ సినిమాను ఇంగ్లిష్‌లో షార్ట్ ఫామ్‌లో PAPA అని పిలుస్తున్నారు లెండి. ఈ నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్ ఇటీవల విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఇదొక ప్రేమకథ. ఇండీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉండేది. ఇది అలాంటి సినిమానే’’ అని చెప్పారు. ఇంకా ఈ సినిమా గురించి, కాన్సెప్ట్ గురించి ఆయన మరిన్ని వివరాలు తెలిపారు.
నటులు డైలాగ్‌లు చెప్పుకుంటున్నట్టు కాకుండా… ఒకరితో ఒకరు క్యాజువల్‌గా మాట్లాడుతున్నట్టే ఉండే సినిమాలను ఇండీ సినిమాలు అనొచ్చు. తాను చూసిన కొంతమందిని, కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకుని ‘పాప’ స్క్రిప్ట్ రాశాను అని చెప్పారు అవసరాల. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ విషయానికొస్తే.. 18 ఏళ్ల నుండి 28 ఏళ్ల వరకు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి జీవిత ప్రయాణమే ఈ సినిమా అని చెప్పారు. హెడ్డింగ్‌లో గొప్ప కాన్సెప్ట్ అన్నారు.. ఇందులో అంత పెద్ద సీన్ ఏముంది అని అనుకుంటున్నారా? అసలు విషయం ఇక్కడుంది.
సినిమా కథను ఛాప్టర్ల రూపంలో విడగొట్టి సిద్ధం చేశారట. అంటే 20 నిమిషాల నిడివితో మొత్తం ఏడు ఛాప్టర్లు కలిపి ఈ సినిమా అట. అంటే ప్రతి 20 నిమిషాలకు సినిమాలో మలుపు ఉంటుందని చెప్పొచ్చు. మరి యువతలో పదేళ్ల జీవితాన్ని చూపించాలంటే ఇలాంటి ఆలోచన ఏదో చేయాల్సిందే. మరి అవసరాల ఏం చేశారు. సినిమాలో ఏం చూపించారు అనేది చూడాలి. ఈ కాన్సెప్ట్ క్లిక్ అయితే సినిమా విజయం పక్కా అంటున్నారు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!