బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే..రిషి పై మరోసారి దాడి జరిగిందని తెలిసి మహేంద్ర జగతి కంగారుపడిన తనకు ఏం కాలేదని సంతోషపడతారు అయినా తనపై ఇలా దాడి చేయడానికి కారణం ఏంటి బహుశా మనం అక్కడికి వెళ్లడం శైలేంద్రకు ఏమైనా తెలిసిందా అంటూ ఇద్దరు ఆలోచనలో పడతారు.అదంతా చాటుగా వింటూ అక్కడికి వస్తాడు శైలజ.
అయితే మహేంద్రను ఆపుతుంది జగతి. మహేంద్ర అందుకే మమ్మల్ని ఇలా వెంబడిస్తున్నావు కదా అంటూ ప్రశ్నిస్తాడు. ఈ విధంగా శైలేంద్ర వారిని ప్రశ్నించడంతో మహేంద్ర తన చేయి పట్టుకొని లాకెళ్లి తన అన్నయ్య ఫణింద్రని పిలుస్తారు.చెప్పు శైలేంద్ర అన్నయ్య అడుగుతున్నారు కదా నీకున్న అనుమానాలన్నింటినీ చెప్పు అంటూ మహేంద్ర మాట్లాడుతారు అసలు ఏం జరిగింది అని దేవయాని కూడా అడుగుతుంది. అప్పుడు దేవయాని నువ్వు నోరెత్తావంటే మర్యాదగా ఉండదు నా తమ్ముడికి కోపం తెప్పించే అంత పని వీడెం చేశాడు అసలేం జరిగింది మహేంద్ర అని అడుగుతారు.
నేను జగతి బాల్కనీలో మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చి రిషి గురించి ఆరా తీస్తున్నాడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు అసలు తను ఏ ఉద్దేశంతో ఇలా మమ్మల్ని అడుగుతున్నారు మాకు అర్థం కావడం లేదు అంటూ మహేంద్ర చెప్పడంతో ఫణింద్ర అసలు బుద్ధి ఉందా నీకు వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి నువ్వెందుకు వెళ్లావు అంటూ తనని తిడతారు.తన తండ్రి అలా తిట్టడంతో శైలేంద్ర దేవయానివైపు చూస్తాడు ఏంటి మీ అమ్మ వైపు అలా చూస్తున్నావ్ ఇందులో మీ అమ్మ పాత్ర కూడా ఉందా అంటూ ఇద్దరిని తిట్టి ఇంకొకసారి ఇలా రిపీట్ కాకూడదని చెబుతారు.
నేను మహేంద్రా ఎలా ఉన్నాము నువ్వు రిషి కూడా అలాగే ఉండాలి అంటూ శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు.జగతి ఈ గొడవ పెద్దదవుతుందని గ్రహించి వదిలేయండి బావగారు తానే తెలుసుకుంటారులే అని చెబుతుంది. మరోవైపు ఎందుకు ఇలా చేసావు మహేంద్ర అనడంతో వారు అన్నయ్యకు మాత్రమే భయపడతారు. వారిని సరైన మార్గంలో పెట్టకపోతే ఇంకా ఎక్కువ అనర్థాలు జరుగుతాయని మాట్లాడుకుంటారు. మరోవైపు రిషి వసుధార అన్న మాటల గురించి ఆలోచిస్తారు ఎందుకు నాపై పదేపదే ఇలా దాడి జరుగుతుంది.
ఇలా నాపై దాడి చేసే వాళ్ళు ఎవరో మేడం, వసుధారకు తెలుసా అందుకే కావాలనే నాపై నింద వేశారా అంటూ ఆలోచనలో పడతారు. ఏది ఏమైనా నేను మోసగాడినని వాళ్ళు నాపై నింద వేసి నా మనసు విరగొట్టారు.గతం గురించి ఆలోచించడం అనవసరం అని అనుకుంటాడు అలాగే జగతి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ టేక్ అప్ చేయమన్న మాటలు కూడా గుర్తుకు వస్తాయి. నన్ను రాయిలా మార్చేశారు నావల్ల కాదు అని అనుకుంటాడు.
తరువాత నేను వ్యక్తిగతంగా ఆలోచిస్తూ నా ఆశయాలకు దూరం అవుతున్నానా అన్న ఆలోచనలో రిషి పడ్డారు. మరోవైపు వసుధార కూడా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమబంధం, రిషిధార బంధం, ప్రేమ,జీవితం అని ఏవేవో మాట్లాడుకుంటుంది. మీరు అర్థం చేసుకునే వరకూ మీపై ఉన్న ప్రేమని గుండెల్లో దాచిపెట్టుకుంటాను సార్ అనుకుంటుంది.అంతలోనే ఏంజెల్ అక్కడికి వచ్చి వసుధార భోజనం ఇక్కడికే తీసుకురానా అని చెప్పడంతో నా కాలు బాగుంది నేనే భోజనానికి వస్తానని చెప్పి వెళుతుంది. సరే రా రిషిని కూడా పిలుద్దామని వెళ్తారు.