Guppedanta Manasu July 26th: చిక్కుల్లో పడిన వసుధారా… సడన్ ఎంట్రీ ఇచ్చిన రిషి!

బుల్లితెర ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టును విష్ కాలేజ్ కు అప్పగిస్తున్నట్లు జగతి బోర్డు మీటింగ్ పెట్టుకుని చెబుతుంది. అయితే కూడా అక్కడికి వెళ్లి పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేయడంతో జగతి సీరియస్ అవుతుంది అసలు నీకు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పట్ల ఏమాత్రం అవగాహన లేదు అయినా ఈ పిచ్చి ప్రశ్నలు ఏంటి అని జగతి మాట్లాడుతుంది.

దాంతో శైలేంద్ర చూశారా డాడ్ మీ ముందే నన్ను ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఆ పేర్లు చెప్పలేదు అంటే ఏదో తప్పు చేస్తున్నారనే కదా అంటూ జగతి వాళ్ళపై లేనిపోనివి చెబుతాడు. శైలేంద్ర మాటలు విన్నటువంటి ఫణీంద్ర అసలు నిన్ను ఎవడు ఈ మీటింగ్ కు రమ్మన్నారు.మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అంటూ తనని అందరి ముందు అవమానించారు. వాళ్ల గురించి నాకు తెలుసు వాళ్ళు ఏం చేసినా అందులో మంచే ఉంటుంది.

నువ్వు ఈ విషయం గురించి ఇంకొకసారి ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉండదు అంటూ తన కొడుకుకి బాగా బుద్ధి చెబుతాడు.మరోవైపు వసుధర ఏంజెల్ ని తీసుకొని బయటకు వెళ్తుంది అయితే వీరిని కాలేజ్ అటెండర్ ఫాలో అవుతారు. శైలేంద్ర తనని డబ్బుతో కొని వాళ్ళు కదలికలను తనకి చెప్పమని చెబుతారు. వెళ్లి విశ్వం దగ్గర వసుధార మేడం వాళ్ళు ఎక్కడికి వెళ్లారు మీకు తెలుసా అని అడుగుతారు నాకు తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తొందరగా వచ్చేస్తారులే అని చెబుతారు.

మేడం కాలు బాగాలేదు, పైగా ఈ రోజే కాలేజీకి వచ్చారు అప్పుడే ఎక్కడికి వెళ్లారు అని రిషి మాట్లాడటంతో విశ్వం ఏమి గమనించినట్లే ఉంటావు కానీ అన్ని విషయాలు తెలుసుకుంటావు వాళ్లకు ఏం కాదులే రిషి అని ధైర్యం చెబుతాడు. రిషి మాత్రం వాళ్లు అలా నాకు నచ్చలేదు అనుకుంటాడు.మరోవైపు ఏంజెల్ వసుధారతో మాట్లాడుతూ కాలేజీలో ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు బయటకు తీసుకెళ్తున్నామని అడుగుతుంది.రిషి కూడా మనతో పాటు వచ్చి ఉంటే బాగుండేది తనకిష్టం లేకపోయినా నేను పిలిస్తే నాతోపాటు వస్తారు కాకపోతే ఇప్పుడు రాలేదు.

బహుశా నువ్వు ఉన్నావేమో అందుకే రాలేదు అంటూ ఏంజెల్ మాట్లాడుతుంది.అయినా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు వసుధారా అని అడగగా ఒక బస్తీకి వసు ఏంజెల్ ను తీసుకెళ్లి అక్కడ కొందరి పిల్లలను చూపించి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గొప్పతనం వీళ్ళకి చెబితే వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి ముందుకు వస్తారు అంటూ వారికి ఈ విషయం చెబుతుంది.వీరిని ఫాలో అయినటువంటి కాలేజ్ అటెండర్ శైలేంద్ర కు ఫోన్ చేసి చెప్పగా ఎలాగైనా ఈ ప్లాన్ చెడగొట్టాలని అటెండర్ కు చెబుతారు. ఇంతలోపు అక్కడ కొందరు బస్తీ వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వారిపై తిరగబడేలా చేస్తారు.

ఇంతలో ఇద్దరు దంపతులు అక్కడికి వచ్చి మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాము చదివిస్తామని ఆశలు చెప్పి మధ్యలోనే వదిలేసి వెళ్తారు అంటూ గొడవ పడతారు. ఆమె భర్త వసుధార వాళ్ళ కార్ టైర్ గాలి తీయడంతో వసుధార అతనిపై కోపడుతూ నువ్వు అసలు మనిషివేనా అని తిడుతుంది దాంతో నా భర్తనే అంత మాట అంటావా అంటూ ఆ మహిళ వసుధార పైకి చేయి ఎత్తుతుంది. వసుధార తనని అడ్డుకుంటుంది అంతలోపే అక్కడికి పాండియన్ గ్యాంగ్ తో రిషి ఎంట్రీ ఇస్తారు అది చూసిన వసుధార షాక్ అవుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus