Pindam Movie: ‘పిండం’ కూడా ‘మసూద’ రేంజ్ సక్సెస్ అందుకుంటుందా..?

గతేడాది డిసెంబర్లో ‘మసూద’ అనే చిన్న సినిమా రిలీజ్ అయ్యింది.ఇది హార్రర్ సినిమా అనే సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా నవంబర్ 18 న రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదట ఈ సినిమా పై జనాలకు ఆసక్తి లేదు. పైగా 2 గంటల 40 నిమిషాల రన్ టైం అని తెలియడంతో మొదటి రోజు 20 శాతం బుకింగ్స్ కూడా నమోదు కాలేదు. కానీ మార్నింగ్ షోల నుండి పాజిటివ్ టాక్ రావడంతో..

ఈవెనింగ్ షోలకు 60 శాతం బుకింగ్స్ నమోదయ్యాయి. అలా మొదటి రోజును మించి రెండో రోజు, మూడో రోజు.. కలెక్షన్స్ పెరిగాయి. సరిగ్గా ఏడాది తర్వాత ఇదే సీన్ మరో చిన్న సినిమాకి రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘పిండం’ అనే హర్రర్ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. సాయి కిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాని (Pindam Movie) ‘కళాహి మీడియా’ బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు.

శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించగా అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించారు. నిన్న మార్నింగ్ షోలు ఈ సినిమా బుకింగ్స్ సో సో గానే ఉన్నాయి. కానీ ఫస్ట్ షో, సెకండ్ షో.. లకు బాగా పెరిగాయి. రెండో రోజు కూడా కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. మరి ఇది కూడా ‘మసూద’ లా పెద్ద సక్సెస్ అందుకుంటుందా? లేదా? అనేది.. వీకెండ్ ముగిశాక తెలుస్తుంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus