Pindam Review in Telugu: పిండం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శ్రీరామ్ (Hero)
  • ఖుషి (Heroine)
  • ఈశ్వరి రావు, శ్రీనివాస్ అవసరాల, చైత్ర పెద్ది, లైషా సూరంపూడి తదితరులు.. (Cast)
  • సాయికిరణ్ దైదా (Director)
  • యశ్వంత్ దగ్గుమాతి (Producer)
  • కృష్ణ సౌరభ్ సూరంపల్లి (Music)
  • సతీష్ మనోహరన్ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 15, 2023

ఇప్పుడంటే తెలుగులో హారర్ సినిమాల ఒరవడి తగ్గింది కానీ.. లాక్ డౌన్ కి ముందు అన్నీ ఇండస్ట్రీల నుండి వరుసబెట్టి హారర్ సినిమాలొచ్చాయి. మొన్నామధ్య వచ్చిన “మసూద, విరూపాక్ష” తప్పిస్తే.. చెప్పుకోదగ్గ హారర్ సినిమా ఏదీ రాలేదు. అయితే.. ఇవాళ విడుదలైన పిండం మాత్రం ట్రైలర్ అండ్ క్యాస్టింగ్ తో మంచి ఆసక్తి నెలకొల్పింది. మరి సినిమా అదే స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!

కథ: ఫారిన్ లో తాంత్రిక పద్ధతులపై సర్టిఫికేషన్ కోర్స్ చేసిన ఏకైక భారతీయురాలు అన్నమ్మ (ఈశ్వరి రావు). ఆమె జీవితంపై ఒక స్పెషల్ స్టోరీ తీయడం కోసం ఆమెను సంప్రదిస్తాడు శ్రీనివాస్ అవసరాల. అలా ఆమె జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన కేస్ గురించి వివరిస్తూ.. ఆంటోనీ (శ్రీరామ్) & ఫ్యామిలీ ఆత్మల ద్వారా ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ.. వాళ్ళను ఎలా కాపాడిందో చెప్పుకొస్తుంది అన్నమ్మ.

అసలు ఆంటోనీ & ఫ్యామిలీకి పట్టిన దెయ్యం ఎవరు? ఎందుకని వాళ్ళను ఆ దెయ్యాలు చంపాలనుకుంటాయి? వాళ్ళు దెయ్యాలుగా మారడానికి కారణం ఎవరు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “పిండం” చిత్రం.

నటీనటుల పనితీరు: సినిమా మొత్తంలో తన నటనతో ఆకట్టుకొని.. దడ పుట్టించిన నటి చిన్నారి చైత్ర. మూగమ్మాయిగా ఆమె నటన & హావభావాలు ప్రేక్షకుల్ని భలే ఆకట్టుకున్నాయి. ఈశ్వరి రావుకి మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. ఆమె ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. శ్రీరామ్, ఖుషి తదితరులు ఆకట్టుకోవడానికి ప్రయత్నించినా ఎందుకో పెద్దగా వర్కవుటవ్వలేదు. చిన్న పాత్రే అయినప్పటికీ.. శ్రీనివాస్ అవసరాల ఇంపాక్ట్ గట్టిగా ఉంది.

సాంకేతికవర్గం పనితీరు: ప్రేక్షకులు సినిమాలో కాస్త ఇన్వాల్వ్ అయ్యారన్నా.. సెకండాఫ్ లో కాస్త భయపడ్డారన్నా అందుకు కారణం సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్. మంచి సౌండ్ డిజైన్ & బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాడు. అతడి పనితనం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. సతీష్ మనోహరం సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. రెగ్యులర్ జంప్ స్కెర్ షాట్స్ తో కాకుండా లాంగ్ జూమ్ షాట్స్ తో టెన్షన్ ను క్రియేట్ చేసిన విధానం బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది.

దర్శకుడు సాయికిరణ్ ఒక సాధారణమైన కథను కొత్తగా హారర్ జోనర్ లో ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని హాలీవుడ్ సన్నివేశాలు, సినిమాల రిఫరెన్సులు మరీ స్పష్టంగా ఉన్నా.. తనదైన శైలిలో ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఫస్టాఫ్ లో కథను కాస్త కన్ఫ్యూజింగ్ గా నడిపించినా.. సెకండాఫ్ లో బ్యాక్ స్టోరీ & చివరిలో ముగింపు అలరించాయి. కథకుడిగా తడబడినా, దర్శకుడిగా మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు సాయికిరణ్. బడ్జెట్ లేకపోవడం వల్లనో లేక ఈమాత్రం సరిపోతుందిలే అనుకోవడం వల్లనో.. గ్రాఫిక్స్ మాత్రం చాలా చీప్ & ఎబ్బెట్టుగా ఉన్నాయి. సినిమాకి మెయిన్ మైనస్ కూడా ఆ గ్రాఫిక్స్ అనే చెప్పాలి.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా.. థియేటర్ కి వెళ్తే మాత్రం ఓ మోస్తరుగా అలరించే హారర్ డ్రామా “పిండం”. గ్రాఫిక్స్ & స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే.. సినిమాటోగ్రఫీ & సౌండింగ్ కోసమైనా ఈ సినిమా (Pindam) పెద్ద హిట్ అయ్యేది.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus