Pisachi 2: ‘పిశాచి 2’ గురించి డైరక్టర్‌ క్లారిటీ… మరి అవెలా ఉంటాయో?

  • July 12, 2023 / 04:50 PM IST

కోలీవుడ్‌ సినిమాల్లో భయపెడుతూ నవ్వించే సినిమాలు చూశాం, భయపెడుతూ ఆలోచింపజేసే సినిమాలూ చేశాం. కేవలం భయపెట్టే సినిమాలు కూడా చూశాం. అయితే రెండో రకం సినిమాలకు మిస్కిన్‌ బాగా ఫేమస్‌. ‘పిశాసు’ / ‘పిశాచి’ సినిమాతో ఆయన కొత్తరకం ట్రెండ్‌ సృష్టించారు. ఆ సినిమాలో ఎంతగా భయపెట్టారో, ఆఖరున అంతే ఆలోచించేలా చేశారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌, స్నేహం, ప్రేమ మామూలుగా ఉండవు ఆ సినిమాలో. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వె సిద్ధం అవుతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని పుకార్లు ఇప్పుడు కోలీవుడ్‌లో, టాలీవుడ్‌లో షికార్లు చేస్తున్నాయి. వాటి ప్రకారం చూస్తే ఈ సినిమాలో కథానాయిక ఆండ్రియా నగ్న సన్నివేశాల్లో, అర్ధ నగ్న సన్నివేశాల్లో కనిపిస్తుందని టాక్‌. దీంతో ఇలా ఎందుకు? అసలు ఏంటీ ఆలోచన అనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయంలో అలాంటి పుకార్లకు ఆస్కారం ఇవ్వకూడదు అని దర్శకుడు మిస్కిన్‌ అనుకున్నట్లు ఉన్నారు. అందుకే పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చారు.

‘పిసాసు 2’ (Pisachi 2) సంవత్సరం క్రితం ప్రారంభం అయి ఇటీవల వరకు షూటింగ్‌ జరుపుకుంది. ఈ హర్రర్ సినిమాలో ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. విజయ్ సేతుపతి కీలక పాత్రధారి. పుకార్లలో వినిపిస్తున్నట్లు ‘పిసాసు 2’లో నగ్న సన్నివేశాలు లేవు అంటూ మిస్కిన్‌ కుండ బద్దలు కొట్టేశారు. అయితే, కొన్ని శృంగార సన్నివేశాలను మాత్రం చిత్రీకరించానని చెప్పుకొచ్చారు. అయితే ఎలాంటి కట్‌లు, మ్యూట్‌లు లేకుండానే సినిమా సెన్సార్‌ అయిందని తెలిపారు.

‘పిశాసు’ సినిమా 2014లో వచ్చింది. ఆ సినిమా గురించి ఇప్పటికీ హారర్‌ మూవీ లవర్స్‌ చెప్పుకుంటూ ఉంటారు. అంతలా ఈ సినిమా నచ్చేసింది అని చెప్పాలి. ఇప్పుడు ‘పిశాసు 2’తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంటే ‘పిశాసు 3’ సినిమాకు కథ సిద్ధం చేస్తారని అంటున్నారు. అయితే నేటి అభిరుచులకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటే మాత్రం విజయం పక్కా అని చెప్పొచ్చు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus