నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్.. లు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. వీళ్ళు కాకుండా అడపా దడపా హీరోగా సినిమాలు చేస్తున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ‘కళ్యాణ్ రామ్ పని అయిపోయింది’ అనే కామెంట్లు ఎక్కువవుతున్న తరుణంలో ఓ మంచి హిట్ ఇచ్చి ఆ కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పెడుతుంటాడు కళ్యాణ్ రామ్.’పటాస్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎం.ఎల్.ఎ’ ‘118’ వంటి యావరేజ్, అబౌవ్ యావరేజ్ సినిమాలతో మాత్రమే సరిపెట్టిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘బింబిసార’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ టీజర్, ట్రైలర్లు రిలీజ్ అయ్యాక అవన్నీ పటాపంచలు అయిపోయాయి. రిలీజ్ కు ముందు వచ్చిన రెండు ట్రైలర్లు సూపర్ అనిపించాయి. సినిమా పై అంచనాలు పెంచాయి. అందుకు తగ్గట్టే ఈరోజు(ఆగస్టు 5న) విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తుంది. అయితే ఏ సినిమాకి అయినా పాజిటివ్స్, నెగిటివ్స్ అనేవి సర్వసాధారణం. మరి ‘బింబిసార’ కి ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా ప్లస్సులు :
1) నూతన దర్శకుడు అయినప్పటికీ మల్లిడి వశిష్ట్.. ‘బింబిసార’ వంటి బరువైన కథను చాలా ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దాడు.ఇలాంటి కాన్సెప్ట్ లు రాజమౌళి మాత్రమే హ్యాండిల్ చేయగలడు అని అంతా ఇప్పటివరకు అనుకున్నారు. కానీ అది అసాధ్యం కాదు అని మల్లిడి వశిష్ట్ ప్రూవ్ చేశాడు. అతనికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు అని ‘బింబిసార’ తో చాటి చెప్పాడు వశిష్ట్.
2) కళ్యాణ్ రామ్ కథని, కొత్త దర్శకుడిని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు ఈ మూవీ కోసం అతను ఏకంగా 13 కేజీలు తగ్గడం వంటి దాన్ని కూడా అభినందించొచ్చు. పౌరాణిక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ నందమూరి ఫ్యామిలీ అని అంతా అంటుంటారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది. రెండు రకాల షేడ్స్ ను అతను ఎంతో ఈజ్ తో పోషించాడు. డైలాగ్ డెలివరీ లో కూడా వేరియేషన్ చూపించాడు కళ్యాణ్ రామ్. నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ కు మంచి మార్కులే పడతాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
3) ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ కూడా మెయిన్ ఎస్సెట్ అని చెప్పాలి. తక్కువ బడ్జెట్ లో భారీ అవుట్ పుట్ ఇచ్చి తన సీనియారిటీ ఏంటనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే.. ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాల కంటే బెటర్ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉన్న సినిమా ‘బింబిసార’ అనడంలో అతిశయోక్తి లేదు.
4) కీరవాణి ని నేపధ్య సంగీతం కోసం తీసుకుని చాలా మంచి పని చేశారు దర్శక నిర్మాతలు అని చెప్పాలి.హీరో ఎలివేషన్స్ కు, మరీ ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్లాక్ లకు ఇతను అందించిన నేపధ్య సంగీతం గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ మూడ్ లో ఉన్నప్పుడే ఈ సినిమాకి కూడా పని చేసినట్టున్నాడు. అందువల్ల ఈ సినిమాకి కూడా మంచి ఔట్పుట్ ఇచ్చాడు.
5) కేథరిన్ గ్లామర్ షో తో అలరించే ప్రయత్నం చేసింది. పోలీస్ ఆఫీసర్ గా ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కూడా బాగా నటించింది.
6) వాసుదేవ్ మునెప్పగారి రాసిన డైలోగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఇతనికి డిమాండ్ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.
7) తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. ఈ సినిమాకి కూడా చాలా మనసు పెట్టి చేశారు అనిపించింది.
మైనస్సులు :
8) పాటల్ని కంపోజ్ చేసింది చిరంతన్ భట్ అట. ఈ సినిమాలో పాటలు జనాలకు అంతగా ఎక్కలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే పాటలకు ప్రతీ ఒక్కరు సెల్ ఫోన్లు తీసి చూసుకోవడం ఖాయం.
9) మెయిన్ విలన్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన తీరు అంతగా ఆకట్టుకోదు.
10) ఎమోషనల్ సీన్స్ ను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?</strong