టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇలా అతన్ని పిలుచుకునేలా చేసిన చిత్రం ‘పోకిరి’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ మరియు మహేష్ సోదరి మంజుల కలిసి నిర్మించారు. 2006 ఏప్రిల్ 28 న ఈ చిత్రం విడుదలయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ రెండో వారం నుండీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రం బాక్సాఫీస్ మీద దండయాత్ర చెయ్యడం మొదలుపెట్టింది. పోటీగా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘బంగారం’ సినిమా కూడా దీని ముందు నిలబడలేకపోయింది. 299 కేంద్రాల్లో 50 రోజులు, 200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 11.90 cr |
సీడెడ్ | 5.20 cr |
ఉత్తరాంధ్ర | 3.00 cr |
ఈస్ట్ | 2.20 cr |
వెస్ట్ | 2.10 cr |
గుంటూరు | 3.13 cr |
కృష్ణా | 2.72 cr |
నెల్లూరు | 1.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 31.45 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 7.55 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 39.00 cr |
‘పోకిరి’ చిత్రానికి 16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 39 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు 23 కోట్ల వరకూ లాభాలను అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘పోకిరి’.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!