లావణ్య త్రిపాఠికి అందాల రాక్షసి అని మంచి పేరే పెట్టారు. పేరుకు తగ్గట్టు అందాలతో తెలుగు యువతను ఆకర్షించింది. “భలే భలే మగాడివోయ్”, “సోగ్గాడే చిన్ని నాయనా”, “శ్రీరస్తు శుభమస్తు” సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ముఖ్యంగా ఫ్యామిలీ మూవీ అంటే లావణ్య బెస్ట్ ఛాయిస్ గా మారింది. అందుకే వరుసగా ఆఫర్లు అందుకుంది. మిస్టర్, రాధ, యుద్ధం శరణం సినిమాల్లో డిఫెరెంట్ రోల్స్ చినప్పటికీ కలిసి రాలేదు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. గత శుక్రవారం రిలీజ్ అయిన “ఉన్నది ఒకటే జిందగీ” మాత్రం కొంత ఆశలు నిలబెట్టాయి. ఆ ఉత్సాహం తో మళ్ళీ విజయాలను అందుకుందామనుకునేలోపే మరో చిక్కులో పడింది. లావణ్య త్రిపాఠికి కోలీవుడ్ నిర్మాతల సంఘం 3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ మీడియా చెప్పింది.
ఎందుకంటే.. తెలుగులో వచ్చిన “100%లవ్” చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జి.వి. ప్రకాశ్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు. షూటింగ్ సమయానికి లావణ్య సినిమా నుంచి తప్పుకొంది. దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చింది. లావణ్య తప్పుకోవడం వల్ల నిర్మాతకు 3 కోట్ల వరకు నష్టం జరిగిందని అక్కడి పరిశ్రమ పెద్దలకు చెప్పుకోవడంతో వారు లావణ్యకు జరిమానా విధించినట్లు సమాచారం. ఇదే నిజమైతే లావణ్య ఆర్ధికంగా కోలుకోవడం కష్టమని చెబుతున్నారు.