టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నాడు. అతని పై నటి కరాటే కళ్యాణి… హిందూ సంఘాల వారితో కలిసి బుధవారం నాడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విషయం ఏంటి అంటే.. ఈ మధ్యనే దేవి శ్రీ ప్రసాద్.. ఓ పరి అనే నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియో చేసి రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్ లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటెం సాంగ్ లా చిత్రీకరించారని కరాటే కళ్యాణి అలాగే హిందూ సంఘాల వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హిందువులు ఎంతో పవిత్రంగా స్మరించే హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని అశ్లీల దుస్తువులు, నృత్యాలతో చిత్రీకరించి అవమానించడం ఏంటి అంటూ మండిపడుతూ దేవి శ్రీ ప్రసాద్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బ తీసినందుకు గాను దేవి శ్రీ ప్రసాద్ తక్షణమే క్షమాపణలు కూడా చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు వీలైనంత త్వరగా ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని….
లేదంటే దేవి శ్రీ ప్రసాద్ ఆఫీస్ ను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేస్తామని నటి కరాటే కళ్యాణి హెచ్చరించింది. మరి ఈ ఇష్యూ పై దేవి శ్రీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..! దేవి ప్రసాద్ పాటల పై ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమవ్వడం కొత్తేమి కాదు. ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అనే పాటను భజన పాటలతో కంపేర్ చేసి దేవి శ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను దెబ్బ తీశాడు
అంటూ ఆ సినిమా రిలీజ్ టైంలో కొంచెం ఎక్కువ రచ్చే చేశారు. అలాంటి రచ్చ వల్ల ఆ పాట ఇండియన్ లెవెల్లో పాపులర్ అయ్యింది. చాలా రోజులు ట్రెండింగ్లో నిలిచింది.మరి ఈ పాట కూడా అదే విధంగా ట్రెండింగ్ లో నిలుస్తుందేమో చూడాలి.