ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం పై మరో కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. విషయం ఏమిటంటే.. బెంగుళూరు లోని మంత్రి మాల్ ఐనాక్స్ సినిమా కాంప్లెక్స్ వద్ద ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని రామ్ సిగరెట్ తాగుతున్న పోస్టర్లను అక్కడ డిస్ప్లే చేశారు. ఇది పబ్లిక్ ను తప్పుదారి పట్టించేలా ఉందంటూ ‘కొప్టా యాక్ట్’ ప్రకారం థియేటర్ యాజమాన్యానికి అలాగే.. దర్శక నిర్మాతలకి నోటీసులు జారీ చేశారు బెంగుళూర్ పోలీసులు. ఈ విషయం ప్రస్తుతం వైరలవుతుంది.
దీనికి ప్రొడ్యూసర్లు ఛార్మీ అలాగే పూరి జగన్నాథ్ లు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ‘ఇది సదరు చట్టంలోని సెక్షన్ 5ని ఉల్లంఘించే విధంగా ఉందంటూ ‘హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్’ డిపార్ట్ మెంట్ తరఫున జాయింట్ డైరెక్టర్ దీన్ని జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న పూరి అండ్ టీం కు ఇదో పెద్ద షాక్ అనే చెప్పాలి. మిగిలిన ఏరియాల్లో ఎక్కడా రాని కంప్లైంట్ ఒక్క బెంగుళూర్ లోనే రావడం.. వారిని అయోమయంలో పడేసింది.