మహేష్ స్పైడర్ కి తాకిన రాజకీయ సెగ!
- May 15, 2017 / 06:34 AM ISTByFilmy Focus
తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్ మూవీ చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. షెడ్యూల్ రెండో రోజే ఆటకం ఏర్పడి షూటింగ్ ఆగిపోయింది. హైదరాబాద్ నిమ్స్ ఆవరణలో కీలక సీన్స్ ని మహేష్ పై చిత్రీకరిస్తుండగా ఉద్యమకారులు షూటింగ్ ని ఆపేసారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిమ్స్‌లో సౌకర్యాలు పెంచాల్సిందిగా కొందరు తెలంగాణ యూత్ `స్పైడర్` షూటింగ్ కి అంతరాయం కలిగించారు. నిన్నంతా చిత్ర బృందం ఒక షాట్ కూడ తెరకెక్కించలేదు. వ్యతిరేకుల నినాదాలతో నిమ్స్ డైరెక్టర్ దిగొచ్చి.. అక్కడ షూటింగుకు అనుమతులు రద్ధు చేశారు. దీనిపై ఫిల్మ్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
మురుగుదాస్ బృందం ఈ సీన్ ని చెన్నైలోని హాస్పటల్లో చిత్రీకరించేందు పయనమైంది. ఇప్పటికే స్పైడర్ షూటింగ్ ఆలస్యమైందని మహేష్ ఆందోళన పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఇబ్బందిని కలిగించింది. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా ఎస్.జె సూర్య, హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న రిలీజ్ చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















