Balakrishna: పొలిటికల్ సెటైర్లతో అఖండ మూవీ.. కానీ?

మరో ఐదు రోజుల్లో బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజవుతున్న పెద్ద సినిమా అఖండ కావడంతో ఇండస్ట్రీ పెద్దలు ఈ సినిమా ఫలితం, కలెక్షన్లపై దృష్టి పెట్టారు. 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ ఏపీలో అమలవుతున్న తక్కువ టికెట్ రేట్లతో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అఖండ సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఉంటాయని సమాచారం అందుతోంది. హ్యాట్రిక్ కాంబోలో అఖండ తెరకెక్కుతుండగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అఖండ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచింది. శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఏపీలో కొన్ని నెలల క్రితం హిందూ దేవాలయాలపై, విగ్రహాలపై దాడులు జరిగాయి. అఖండ సినిమాలో కూడా ఈ దాడులకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందని ఈ అంశం ద్వారా సినిమాలో బాలయ్య పొలిటికల్ సెటైర్లు వేస్తారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు రేపు శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కు గెస్ట్ గా రానున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బన్నీ తర్వాత సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో బన్నీ ఈ ఈవెంట్ కు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో అఖండ సినిమా రిలీజ్ కానుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus