టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివకు సామాజిక స్పృహ కొంచెం ఎక్కువ. ఆయన మొదటి చిత్రం మిర్చి నుండి భరత్ అనే నేను వరకు ప్రతి సినిమాలో ఆయన ఎదో ఒక సోషల్ టాపిక్ టచ్ చేస్తూ సినిమాలు చేశారు. సోషల్ కాన్సెప్ట్ కి కమర్షియల్ హంగులు దిద్ది సినిమా రూపొందించడం ఆయన శైలి. ఇక ఆయన సినిమాలలో కాంటెంపరరీ సోషల్ బర్నింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి.
గత చిత్రం భరత్ అనే నేను మూవీలో ఆయన పొలిటికల్ సెటైర్స్ గవర్నమెంట్స్ విధి విధానాలను ప్రశ్నించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాల మధ్య చీకటి ఒప్పందాలు వంటి విషయాలు ఆయన చక్కగా చూపించారు. కాగా చిరంజీవితో ఆయన ప్రస్తుతం చేస్తున్న ఆచార్య మూవీలో కూడా సమకాలీన పాలిటిక్స్ లోని లోపాలను ప్రశ్నించే విధంగా కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ ఉండే అవకాశం కలదు. అది అధికార పక్షంపై కావచ్చు, ప్రతి పక్షం పై కావచ్చు..
సెటైర్స్ కొంచెం ఘాటుగానే ఉండే అవకాశం కలదు. కొరటాల తన డైలాగ్స్ మరియు సన్నివేశాలతో కొంత మంది పొలిటిషియన్స్ ని గిల్లడం ఖాయం అని తెలుస్తుంది. ఇక ఆచార్య మూవీ షూటింగ్ దాదాపు 40 శాతం వరకు పూర్తయినట్లు తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించడంతో పాటు, ఓ కీలక రోల్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.