పొన్నియిన్ సెల్వన్ మూవీ రేటింగ్ అంత ఘోరమా?

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సొంతం చేసుకుని హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తమిళంలో ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోగా చారిత్రాత్మక కథలతో తెరకెక్కిన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ బుల్లితెరపై డిజాస్టర్ గా నిలిచింది.
తాజాగా బుల్లితెరపై ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 2.73 రేటింగ్ రావడం గమనార్హం.

ఈ రేటింగ్ అర్బన్ రేటింగ్ కాగా అర్బన్ రూరల్ రేటింగ్ కలిపితే కేవలం ఈ సినిమా రేటింగ్ 2.17 కావడం గమనార్హం. చోళుల కథతో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ గా పొన్నియిన్ సెల్వన్2 తెరకెక్కగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. తొలిసారి ప్రసారమైన సమయంలో ఈ రేటింగ్ అంటే నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాతో పోల్చి చూస్తే మాచర్ల నియోజకవర్గం మూవీ బెటర్ రేటింగ్ ను సొంతం చేసుకుంది.

తెలుగులో పది కోట్ల రూపాయల థియేట్రికల్ కలెక్షన్లను సొంతం చేసుకున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా ఛానల్ నిర్వాహకులకు భారీ షాకిచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. బుల్లితెరపై ఈ సినిమాను చూడని వాళ్లు మాత్రం ఓటీటీలో ఈ సినిమాను చూడవచ్చు. పొన్నియిన్ సెల్వన్2 మూవీ అంచనాలను మించి మెప్పిస్తుందో లేదో చూడాలి. పొన్నియిన్ సెల్వన్2 మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఏప్రిల్ 28వ తేదీన ఇప్పటికే పలు సినిమాలు షెడ్యూల్ కాగా ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. మణిరత్నం ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. మణిరత్నం వరుసగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus