పూజా హెగ్దే ఆ క్రికెటర్ ను తెగ పొగిడేస్తుందెందుకు..?

‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దే.. ఆ చిత్రంలో ఓ రేంజ్లో గ్లామర్ షో చేసి ప్రేక్షకులను.. దర్శకనిర్మాతలను ఆకట్టుకుంది. దాంతో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ .. మహేష్ బాబు తో ‘మహర్షి’ … మళ్ళీ అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్ తో కూడా నటిస్తుంది.

అంతేకాదు అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ వంటి క్రేజీ చిత్రంలో కూడా నటిస్తుంది. మరో పక్క బాలీవుడ్ లో కూడా ఈమె సినిమాలు చేస్తుంది. తమిళంలో కూడా సినిమా చెయ్యడానికి రెడీ అవుతుందని సమాచారం. ఇంత బిజీగా ఉన్న పూజా హెగ్దే కు లాక్ డౌన్ కారణంగా కాస్త రిలీఫ్ వచ్చింది కాబట్టి.. ఇటీవల అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ‘తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా స్కోర్ అడిగి తెలుసుకుంటాను అని’ చెప్పింది.ఇక ‘తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరని’ ఓ నెటిజెన్ అడుగగా .. ఆమె రాహుల్ ద్రావిడ్ అని చెప్పింది.

‘ఆయన ఎంతో కూల్ గా ఆడతారు. అంతటి క్లాసికల్ ఆటకు మరెవ్వరూ సరితూగరు. ఇప్పుడున్న క్రికెటర్స్ లో ధోని, కె.యల్.రాహుల్ ఆటను ఇష్టపడతాను’… అంటూ చెప్పుకొచ్చింది. రాహుల్ ద్రావిడ్ ఆటను ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఇతను ఎన్నో సార్లు ఇండియన్ టీం ఓటమి పాలవ్వకుండా ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా డిఫెండ్స్ ఆడుతూ.. ఎక్కువ బాల్స్ ఆడుతుండేవాడని కొందరు ద్రావిడ్.. జిడ్డు ఆట ఆడతాడని కూడా విమర్శిస్తూ ఉంటారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus